Breaking News

చైనా గురించి అడిగితే యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారేమో.. రాహుల్ గాంధీ

11 th Sep 2020, UTC

న్యూఢిల్లీ :తూర్పు లద్దాఖ్‌లో చైనా సేనలు ప్రవేశించినా కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ విషయం గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తే ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ (దేవుడి సంకల్పితం) అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ తీరంలో పట్టుకోసం చైనా ప్రయత్నిస్తునే ఉంది. తాజాగా చైనా సేనలు కాల్పులు జరిపినట్లు వార్తలు కూడా వచ్చాయి.
 
అయితే చైనా సేనలను ఎదుర్కోవడంలో మోదీ ప్రభత్వం వివఫలమైందని రాహుల్ గాంధీ విమర్శించారు. డ్రాగన్‌కు సరైన సమాదానం చెప్పాల్సింది పోయి మౌనం వహిస్తున్నాయని, కేంద్రం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో దేశానికి జవాబు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన భూభాగాన్ని చైనా ఆక్రమిస్తోంది. మరి భారత ప్రభుత్వం మన భూభాగాన్ని మన ఆధీనంలోకి ఎప్పుడు తెచ్చుకుంటుంది? దాని కోసం ఇప్పటి వరకు కేంద్ర చేసిన పనులు ఏంటి? ఏమో, ఈ విషయం అడిగితే దీనిని కూడా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ (దేవుడి సంకల్పితం) అంటారేమో అని రాహుల్ అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox