Breaking News

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవికి సోనియా రాజీనామా?

23 rd Aug 2020, UTC

ఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షపదవి నుంచి సోనియా గాంధీ తప్పుకోనున్నారా? అంటే అవుననే అంటున్నారు ఆమె సన్నిహితులు. పార్టీలో సమర్ధ, శాశ్వత నాయకత్వం గురించి 20 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు లేఖ రాయడంపై సోనియా గాంధీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి పార్టీ నేతలతో సోనియా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని సూచిస్తూ కొందరు కాంగ్రెస్ నేతలు రాసిన లేఖపై సోనియా గాంధీ ఈ విధంగా స్పందించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

 మరో వైపు కాంగ్రెస్‌లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీకి ఉమ్మడి నాయకత్వం ఉండాలని కొందరు ప్రస్తుత ఎంపీలు, మాజీ మంత్రులు కోరుతుండగా, రాహుల్ గాంధీ మళ్ళీ బాధ్యతలు చేపట్టాలని మరికొందరు కోరుతున్నారు. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  సమావేశం ముగిసిన అనంతరం సోనియా రాజీనామాపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు  తెలుస్తోంది.
 
గాంధీ కుటుంబమే పార్టీకి రక్ష.. అమరీందర్ సింగ్
 
దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమైన తరుణంలో కాంగ్రెస్‌ పార్టీకి గాంధీ కుటుంబ సభ్యుల నాయకత్వాన్ని సవాలు చేయడం సరికాదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. దేశ రాజ్యాంగ విలువలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నాశనం చేస్తోందని, అటువంటి సమయంలో బలమైన ప్రతిపక్షం దేశానికి అవసరమని చెప్పారు. 
 
కెప్టెన్ సింగ్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలని వాదిస్తున్న సీనియర్ పార్టీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. బలమైన, సమైక్య ప్రతిపక్షం లేకపోవడం వల్లే ఎన్డీయే విజయం సాధిస్తోందన్నారు. పార్టీని ప్రక్షాళన చేయాలని ఈ సమయంలో కోరడం అటు పార్టీకి, ఇటు దేశానికి మంచిది కాదని చెప్పారు.భారత దేశం ప్రస్తుతం సరిహద్దుల ఆవలి నుంచి మాత్రమే కాకుండా దేశం లోపల నుంచి కూడా ముప్పును ఎదుర్కొంటోందని చెప్పారు. దేశ సమాఖ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లుతోందన్నారు. దేశాన్ని, ప్రజలను ఏకీకృత కాంగ్రెస్ మాత్రమే కాపాడగలదన్నారు.కొందరికి కాకుండా యావత్తు పార్టీకి ఆమోదయోగ్యమైన నాయకత్వం అవసరమని చెప్పారు. ఈ పాత్ర పోషించడానికి గాంధీలు సరైన వ్యక్తులన్నారు. సోనియా గాంధీ కోరుకున్నంత కాలం పార్టీకి నాయకత్వం వహించాలని, ఆమె తర్వాత సంపూర్ణంగా సమర్థుడైన రాహుల్ గాంధీ నాయకత్వం వహించాలని అన్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox