Breaking News

మోదీ వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు

08 th Aug 2020, UTC
మోదీ వైపే మొగ్గు చూపుతున్న ప్రజలు
 
న్యూఢిల్లీ :దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నా, లాక్ డౌన్ తో కష్టాలపాలయినా  ప్రధాని మోదీ ప్రజాదరణ తగ్గలేదని తెలుస్తోంది. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్‌ ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ పేరిట చేపట్టిన సర్వేలోదేశ ప్రధానిగా నరేంద్ర మోదీకి తిరుగులేదని, ప్రజల్లో ఆయనకున్న విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని వెల్లడయింది. అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా గుర్తిపు పొందిన ఆయనే తదుపరి ప్రధాన మంత్రిగా ఉండాలని 66 శాతం ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వే తెలిపింది. ఇక ఈ విషయంలో కేవలం 8 శాతం మంది మాత్రమే కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ వైపు మొగ్గు చూపినట్లు పేర్కొంది. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి 5 శాతం ఓట్లు పడినట్లు తెలిపింది.
 
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(4%), యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌(3 శాతం), కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ(1 శాతం), పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(2 శాతం), కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ(2 శాతం), రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌(1 శాతం), మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే(1 శాతం), బహుజన్‌ సమాజ్‌ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు కూడా ‘నెక్ట్స్ పీఎం’ ప్రాధాన్య జాబితాలో చోటు దక్కించుకున్నారు.  కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జులై 15, 2020 నుంచి జూలై 27, 2020 మధ్య 12,021 మందితో టెలిఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా వివిధ అంశాల్లో అభిప్రాయాలు సేకరించారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox