Breaking News

జగన్ ను ప్రేమించే వ్యక్తులు ఆ మాటలు ఎన్నాళ్లు భరిస్తారు? ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

20 th Oct 2021, UTC

 టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్  ను తిడుతుంటే వైసీపీ కార్యకర్తలు భరించలేక తిరగబడ్డారని ఏపీ ప్రభుత్వ చీప్ విప్  శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.జగన్ ను ప్రేమించే వ్యక్తులు టీడీపీ నేతల మాటల్ని ఎన్నాళ్లు భరిస్తారని ఆయన ప్రశ్నించారు. కడప వైపీపీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టాబి వ్యాఖ్యలకు కు అర్ధం  చంద్రబాబు నాయుడికి తెలుసా అని  ప్రశ్నించారు. పథకం ప్రకారమే తమ పార్టీకి చెందిన నేతల ద్వారా  చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు ఉపయోగిస్తున్న భాషను గమనించాలని ఆయన ప్రజలను కోరారు.చంద్రబాబునాయుడు ప్లాన్ ప్రకారమే  నేతల ద్వారా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయిస్తున్నారన్నారు.

ప్రభుత్వం చేస్తున్న పథకాలపై తప్పులుంటే ఎత్తి చూపాలన్నారు.కానీ అలా చేయకుండా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తూ నీచమైన భాషను ఉపయోగిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఏనాడైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకొన్నారా అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.కరోనా సంక్షోభసమయంలో కూడా మాట తప్పకుండా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ ఉనికిని కోల్పోయిందన్నారు. తన ఉనికిని కాపాడుకొనేందుకే చంద్రబాబునాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. తన స్వలాభం కోసం వ్యవస్థలన్నింటిని చంద్రబాబు భ్రష్టు పట్టించారని ఆయన మండిపడ్డారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox