Breaking News

ఇంత జరుగుతున్నా..

12 th Sep 2020, UTC
ఇంత జరుగుతున్నా..

న్యూఢిల్లీ :ప్రధాని మోడీ నాయకత్వంలో పక్క ప్రణాళికతో భారత్ కరోనా పై పోరాటం చేస్తోందని కేంద్ర హోంమంత్రి  అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఖండించారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పక్కా ప్రణాళిక తో మోడీ ప్రభుత్వం చేసిన పోరాటం తో దేశం అగాధం లోకి కూరుకుపోయిందన్నారు. చరిత్రలో ఎపుడు లేనంతగా, భారత దేశ జిడిపి 24 శాతానికి పడిపోయిందని విమర్శలు గుప్పించారు. దాదాపు  12 కోట్ల ఉద్యోగాలు ఊడిపోయాయన్నారు. మరో 15.5 లక్షల లోన్లు నిరర్థకంగా మారాయన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే, అత్యంత ఎక్కువగా కరోనా కేసులు, మరణాలు మన దేశంలోనే ఉన్నాయని మండిపడ్డారు. ఓ వైపు దేశంలో ఇంత జరుగుతున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వానికి మీడియాకి "ఆల్ ఈజ్ వెల్" అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox