Breaking News

సీఎం కేసిఆర్ రజాకార్లను తలపిస్తున్నాడు.. ఈటల రాజేందర్

19 th Jul 2021, UTC

హుజురాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్  ప్రజా దీవేన యాత్ర పేరిట సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా శనిగరం గ్రామానికి చేరుకున్న ఈటల అక్కడి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సీఎం కేసిఆర్ రజాకార్లను తలపిస్తున్నాడని ఆరోపించారు. అరె కొడుకుల్లారా ఖబర్దార్. నరహంతకుడు నయీం చంపుతా అని బెదిరిస్తేనే భయపడలేదు. మీ చిల్లర ప్రయత్నాలకు భయపడను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని. మీరు నాపై ఎన్ని కుట్రలు పన్నినా ఏం చేయలేరు అని హెచ్చరించారు. 

నేను ఈటల మల్లయ్య కొడుకుని, ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా. దుబ్బాకలో ఏం జరిగిందో అదే హుజురాబాద్ లో కూడా జరుగుతుంది. 2018లో నన్ను ఓడించడానికి కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు. ఇప్పుడూ నిలుస్తారు'' అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. తనను చంపడానికి కుట్ర పన్నారని  ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకోసం ఓ మంత్రి హంతకుల ముఠాలతో చేతులు కలిపారని, దీనిపై ఇప్పటికే తనకు సమాచారం వచ్చిందన్నారు 

చట్టాల మీద నాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఆ చట్టాలను కాపాడాల్సిన పోలీసులకు నేను సహకరిస్తున్నా, మీరు కూడా నాకు సహకరించండి'' అంటూ ఈటల వ్యాఖ్యానించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox