Breaking News

ఇదేం 'చేదోడు' అని బీసీ కులాలు అడుగుతున్నాయి:దేవినేని ఉమా

11 th Jun 2020, UTC

ఏపీ సీఎం జగన్ ప్రారంబించిన చేదోడు పధకం పై టీడీపీ నేత , మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్ లో విమర్శలు గుప్పించారు. వాస్తవానికి బీసీల జనాభాకు , ఈ పధకం లబ్దిదారులకు పొంతన లేదని  తమకు నచ్చినట్లు కొంతమందికే నగదు పంపిణీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవానికి బీసీల బడ్జెట్ లో కోత పెట్టి కొత్త పధకాలు పెట్టినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేసారు.

వైసీపీ ఎన్నికల ముందు చెప్పిన మాటలకూ.. ఇప్పటి మాటలకు పొంతన లేదని దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల ముందు అందరికీ ‘చేదోడు’ లబ్ధి ఉంటుందని చెప్పి.. ఇప్పుడు మాట మార్చారన్నారు. లక్ష రూపాయల రాయితీని పది వేలకు కుదించారన్నారు. ఎన్నికల ముందు అందరికీ లబ్ధి అని నేడు షాపులు ఉంటేనే అంటూ మాట మార్చారు. కార్పోరేషన్లను రద్దు చేసి లక్ష రూపాయల రాయితీని పదివేలకు కుదించారు. నామమాత్రం ఉన్న ఫైనాన్స్ కార్పొరేషన్ల బడ్జెట్ మళ్లించారు. ఇదేం 'చేదోడు' అని 137 బీసీ కులాలు అడుగుతున్నాయి సమాధానం చెప్పండి జగన్ గారు’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సాగు కోసం అప్పు చేసిన రైతుల ఆవేదనను మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కష్టాల సాగుతో ఆత్మహత్యలు చేసుకుంటున్నామంటున్న రైతుల మాటలు తాడేపల్లి రాజప్రాసాదానికి వినబడుతున్నాయా అని జగన్‌ను ప్రశ్నించారు.

బతకాలని ఉంది, వ్యవసాయాన్ని నమ్ముకుని అప్పులపాలయ్యా. తాగుబోతును, తిరుగుబోతును, తిండిపోతునూ కాదు సాగు కోసమే అప్పులుచేశా.. అంటూ కష్టాల సాగుతో ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు, కౌలు రైతుల మాటలు తాడేపల్లి రాజప్రాసాదానికి వినబడుతున్నాయా చెప్పండి జగన్ గారు’’ అని దేవినేని ఉమ ట్వీట్‌లో ప్రశ్నించారు. 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox