Breaking News

మీ 'సరస్వతి' కంపెనీపై సమాధానం చెప్పండి: దేవినేని

29 th Jun 2020, UTC
మీ 'సరస్వతి' కంపెనీపై సమాధానం చెప్పండి: దేవినేని

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన సొంత కంపెనీ సరస్వతీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌కు మోసపూరిత అనుమతులపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...అమరావతిలో ప్రాజెక్టుల పేరుతో  అనుమతులు కోరారు. రెట్టింపు కృష్ణా నీటిని జీవితకాలం ఇచ్చారు. సర్వేనెంబర్లను మారుస్తూ జీవోలను ఇచ్చి మళ్లీ ఆ జీఓలను మార్చారు. అడిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, పత్రికలకి నోటీసులు ఇస్తారా? మీ'సరస్వతి' కంపెనీపై ప్రజలడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండి జగన్ గారు అంటూ ట్వీట్ చేశారు.


మరో ట్వీట్ లో పేదలకు ఇళ్ల పేరుతో నివాసయోగ్యంకాని ప్రాంతాలను చూపడం పట్ల  దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ముంపు ప్రాంతమైనా, కొండగట్టులైనా ఇచ్చిన చోట ఉండాల్సిందే. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు. స్మశానాలు, కొండలు, తుప్పలు దారిలేని ప్రాంతమైన మీ నేతలు చెప్పినట్లు వినాల్సిందే. పనికిరాని భూములకు అధిక ధరలు చెల్లించాల్సిందే. "సెంటుభూమి" పేరుతో మీపార్టీ నాయకుల దోపిడీపై ఏం చర్యలు తీసుకుంటారు జగన్‌ గారు అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox