Breaking News

నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ కార్యక్రమం

13 th May 2022, UTC

Udaipur: వరుస పరాజయాలతో చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తేవడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న చింతన్‌ శిబిర్‌ ఇవాళ ప్రారంభం కానుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో పాటు వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్‌ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొననున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సంస్థాగత, వ్యవసాయ సమస్యలు, అధికార బీజేపీని ఎదుర్కొనే వ్యూహాలపై రోడ్‌మ్యాప్‌ సిధ్దం చేయనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు ప్రారంభోపన్యాసం చేయనుండగా, 15న రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండో సారి ఓటమి, ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల్లో పరాజయ భారంతో కుంగిపోయిన కాంగ్రెస్‌కు భవిష్యత్తు వ్యూహాన్ని నిర్ణయించడంలో చింతన్‌ శిబిర్‌ చాలా కీలకంగా మారింది. 2013లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు జైపూర్‌లో చివరిసారిగా చింతన్‌ శిబిర్‌ను నిర్వహించగా, అనంతరం ఇప్పుడే మళ్లీ పార్టీ ఈ తరహా భేటీని నిర్వహిస్తోంది. నిర్మాణాత్మక మార్పుల కోసం కాలానుగుణ కార్యాచరణ ప్రణాళికను, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు ఎంపిక చేసిన సమస్యలపై సుదీర్ఘ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం లక్ష్యంగా ఈ శిబిర్‌ను నిర్వహిస్తోంది.

నేటి నుంచి మూడు రోజుల పాటు జ‌రిగే చింత‌న్ శివిర్‌లో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీ నుంచి ఉద‌య్‌పూర్‌కు రైలులో బ‌య‌లుదేరి వెళ్లారు. న‌వ్ సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్ పేరుతో జ‌రుగుతున్న ఈ స‌ద‌స్సులో పార్టీ పూర్వ వైభ‌వానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, అనుస‌రించాల్సిన వ్యూహం పై చ‌ర్చిస్తార‌ని స‌మాచారం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత త్వ‌ర‌లో చింత‌న్ శివిర్ స‌ద‌స్సు ఉంటుంద‌ని ఆ పార్టీ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ ప్ర‌క‌టించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox