Breaking News

కేంద్రంలో మార్పు తథ్యం.. సీఎం కేసీఆర్

26 th May 2022, UTC
కేంద్రంలో మార్పు తథ్యం.. సీఎం కేసీఆర్

Bangalore: కేంద్రంలో మార్పు త‌థ్య‌మ‌ని, రెండు మూడు నెల‌ల త‌ర్వాత సంచ‌ల‌న వార్త వింటార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. బెంగళూరు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్, మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా దేశంలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితులతో పాటు రాజ‌కీయ అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత సీఎం కేసీఆర్ మాజీ సీఎం కుమార‌స్వామితో క‌లిసి మాట్లాడారు.

భార‌త్ కంటే త‌క్కువ జీడీపీ వున్న చైనా ఇప్పుడు ఆర్థికంగా ప్ర‌పంచాన్ని శాసిస్తోంద‌న్నారు. మోదీ ప్ర‌భుత్వం మాత్రం 5 ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని, ఇది దేశానికే అవ‌మాన‌మ‌ని అన్నారు. నిజంగా మ‌న‌సు పెట్టి అభివృద్ధి చేస్తే, అమెరికా కంటే ఆర్థికంగా మ‌న‌మే ఫ‌స్ట్ ప్లేస్‌లో వుంటామ‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

క‌రెంట్ కోసం, మంచినీళ్ల కోసం, సాగు నీటి కోసం  దేశం ఇంకా అల్ల‌ల్లాడుతూనే వుంద‌ని సీఎం కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కేంద్రంలో ఎవ‌రి సార‌థ్యంలో ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంది అన్న‌ది ఇక్క‌డ ప్ర‌ధానం కాద‌ని, ఒక ఉజ్వ‌ల భార‌తం కోసం శ్ర‌మించాల్సిన అవ‌స‌రం వుంద‌ని నొక్కి చెప్పారు. దేశంలోని ఏ వ‌ర్గం కూడా మోదీ పాల‌న‌తో సంతోషంగా లేద‌ని సీఎం కేసీఆర్ విమ‌ర్శించారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox