Breaking News

నేడు సీఎం జగన్ ను కలవనున్న సినీ పెద్దలు..!

09 th Jun 2020, UTC

కరోనా మహమ్మారి కారణం గా ప్రపంచం స్థంభించిపోయిన సంగతి తెలిసిందే. గత రెండున్నర నెలలు గా జన జీవనం ఇంటికే పరిమితం అయిపొయింది. ఆఫీసులు పనులు ఇంట్లోనే కానిచ్చేస్తున్నారు. నిరవధిక లాక్ డౌన్ నిబంధనలతో చిత్ర పరిశ్రమ కూడా మూగబోయింది.. షూటింగ్ లు లేక...సినీ ప్రముఖులు ఇళ్లకే పరిమితమయ్యారు. మరోవైపు సినీ కార్మికులు.. రెక్కాడితే కానీ డొక్కాడని పని వారు.. పని దొరక్క.ఆదాయం లేక అల్లాడిపోయారు. పనులు ఆగిపోయి..ఉత్పత్తి లేక.. ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయింది. ఈ తరుణం లో ఆర్థిక వ్యవస్థను తిరిగి చక్కదిద్దే క్రమం లో నిబంధనలను సడలించారు. 
 
          ఈ నేపధ్యం లో షూటింగ్ లను కూడా తిరిగి ప్రారంభించాలని సినీ పెద్దలు భావిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం నిబంధనల విషయం లో సడలింపులు ఇవ్వడం తో... సినీ పరిశ్రమని కూడా తిరిగి గాడి లో పెట్టాలని భావిస్తున్నారు. ఈ సందర్భం గానే... ఇటీవల చిరంజీవి తో సహా పలువురు ప్రముఖులు కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని ని కలిశారు...చర్చల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కూడా కలిశారు. అయితే.. చర్చల తరువాత.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రభుత్వం విధించిన కరోనా నిబంధనలను పాటిస్తూ షూటింగ్ లు జరుపుకోవచ్చని ముఖ్యమంత్రి కెసిఆర్ అనుమతులిచ్చారు. అయితే.. థియేటర్ల విషయం లో... కేంద్రం నిబంధనలను పాటించాల్సి ఉన్నందున.. అనుమతులు ఇవ్వలేమని తెలిపారు.
 
          ప్రస్తుతం.. సినీ ప్రముఖులంతా కలిసి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కూడా కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు వీరు భేటీ కానున్నారు. చిరంజీవి నేతృత్వంలో.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సినీ బృందం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానుంది. చిరంజీవితో పాటు అక్కినేని నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌, కొరటాల శివ, జీవిత, నిర్మాత సి.కళ్యాణ్‌ తదితర సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox