Breaking News

పన్నీర్ సెల్వానికి చేదు అనుభవం

23 rd Jun 2022, UTC
పన్నీర్ సెల్వానికి చేదు అనుభవం

Chennai: గురువారం జరిగిన ఏఐడీఎంకే సర్వసభ్య మండలి సమావేశానికి హాజరైన పన్నీర్‌సెల్వం పై పళనిస్వామి వర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు వాటర్ బాటిల్స్ విసిరేసి మరీ వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. పరిస్థితులన్నీ తనకు ప్రతికూలంగా మారడంతో చేసేదేమీ లేక పన్నీరుసెల్వం ఆయన మద్దతుదారులు సమావేశం మధ్యలోనే అర్థాంతరంగా వెళ్లిపోయారు. పన్నీర్ సెల్వం సూచించిన 23 తీర్మానాలు రద్దయ్యాయి. ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఓపీఎస్ ద్రోహి అంటూ ఈపీఎస్ వర్గం నినాదాలు చేయడంతో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో, సమావేశం నుంచి పన్నీరుసెల్వం మధ్యలోనే వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

23 తీర్మానాలపై మాత్రమే అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవచ్చని, ఇతర విషయాలపై చర్చ మాత్రమే జరగాలని మద్రాస్ హైకోర్టు  గురువారం తెల్లవారుజామున 4.20 నిమిషాలకు ఆదేశాలు జారీ చేసింది. జనరల్ కౌన్సిల్ సభ్యుడు షణ్ముగం అభ్యర్థనతో జస్టిస్ ఎం.దురైస్వామి, జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన డివిజన్ బెంచ్ వాదనలు విని ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో, ఏక నాయకత్వంపై సర్వ సభ్య నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోయింది. మరి పన్నీర్ సెల్వం తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox