Breaking News

ఇద్దరు సీఎం లు నందమూరి అభిమానులే...!

07 th Jun 2020, UTC
ఇద్దరు సీఎం లు నందమూరి అభిమానులే...!
కరోనా మహమ్మారి నేపధ్యం లో షూటింగ్ లు వాయిదా పడిన సంగతి తెలిసిందే.అయితే.. షూటింగ్ లను తిరిగి ప్రారంభించే ఉద్దేశం తో.. చిరంజీవి తో సహా పలువురు ప్రముఖులు  తెలంగాణ మంత్రి తలసాని తో చిరు నివాసం లో భేటీ అయ్యారు. ఈ మీటింగ్స్ కు చిరంజీవి , నాగార్జున , రాజమౌళి, త్రివిక్రమ్, సి కళ్యాణ్ , మరికొంతమంది హాజరయ్యారు. ఈ రెండు మీటింగ్ లకు బాలకృష్ణను పిలవకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బాలకృష్ణ భూములు పంచుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇక త్వరలో ఏపీ సీఎం జగన్ కు కలవబోతున్నారు సినీ పెద్దలు. అయితే.. ఈ మీటింగ్ కు బాలకృష్ణను ఆహ్వానించినా పుట్టినరోజు కారణం గా రాలేనని చెప్పారు. 
            ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ.. ఇద్దరు ముఖ్యమంత్రులు నందమూరి అభిమానులే అని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్టీఆర్ అంటే చెప్పలేని అభిమానం అందుకే ఆయన కుమారుడికి తారకరామారావు అనే పేరు పెట్టారు. మరో వైపు.. సీఎం జగన్ కు ఎన్టీఆర్ అంటే అభిమానమని చెప్పారు. సీఎం జగన్ విషయానికొస్తే ఆయన మొదటినుంచి బాలకృష్ణ వీరాభిమాని. ఇక సీఎం జగన్ మీకు వీరాభిమాని తెలుసా..? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య తెలుసు అని సమాధానం చెప్పారు. ఇంకా మాట్లాడుతూ... సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు..ఎన్టీఆర్‌గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన అభిమాని కానివారు ఎవరు? అప్పట్లో పెద్ద పార్టీ కాంగ్రెస్‌. అందులో 90 శాతం మంది నాన్నగారి అభిమానులే....అంటూ బాలయ్య సమాధానం చెప్పుకొచ్చారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox