Breaking News

నీరు నిలిచిన రహదారిపై బికెయు నేత రాకేష్ తికాయత్ ధర్నా

13 th Sep 2021, UTC

భారతీయ కిసాన్ యూనియన్ ( బికెయు) నాయకుడు రాకేష్ తికాయత్ తన మద్దతుదారులతో కలిసి ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దులోని ఘాజీపూర్ వద్ద  ధర్నా చేసారు. ఢిల్లీలో భారీ వర్షాలు  రైతు సంఘాలు ఏర్పాటు చేసిన టెంట్‌లు మరియు ఇతర నిర్మాణాలను దెబ్బతీశాయి.  నిరసనకారులు కూర్చున్న ప్రదేశం అంతా నీటితో నిండిపోయింది. అయితే  రాకేశ్ తికాయత్ నీటితో నిండిన రహదారిపై కూర్చుని నిరసనను కొనసాగించారు. 

ఇక్కడి నుండి ఢిల్లీ వైపు వెళ్లే కాలువలను శుభ్రం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము కానీ సంబంధిత అధికారులు దానిని పట్టించుకోలేదు అని మీడియా ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర మాలిక్ అన్నారు.ఇప్పుడు నిరసన తెలుపుతున్న రైతులు మూడు కాలాలను (శీతాకాలం, వేసవి మరియు వర్షాలు) చూశారు. రైతులు ఇప్పుడు దేనికీ భయపడరు అని మాలిక్ అన్నారు.

కేంద్రం ప్రతిపాదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత నవంబర్ నుంచి రైతులు ఢిల్లీ వీధుల్లో నిరసనలకు దిగుతున్నారు.నిరసనకారులతో  ప్రభుత్వం 11 రౌండ్ల అధికారిక చర్చలు  జరిపినప్పటికీ ఇరు పక్షాలమధ్య  ఏకాభిప్రాయం కుదరలేదు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox