Breaking News

తమిళనాడు అసెంబ్లీలో నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) కు వ్యతిరేకంగా బిల్లు

13 th Sep 2021, UTC

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మెడికల్ కాలేజీలకి నీట్ ఆధారిత అడ్మిషన్లను రద్దు చేయడానికి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తమిళనాడు ప్రభుత్వం నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) నుండి రాష్ట్రానికి శాశ్వత మినహాయింపును అందించే బిల్లును శాసనసభలో తీసుకురావాలని గతంలో నిర్ణయించింది. నీట్ భారతదేశానికి ప్రధాన సమస్యగా మారిందన్నారు. నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు కోరుతూ  బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.

నీట్ పరీక్షకు హాజరయే విద్యార్ది ఒకరు సేలంలోని తన ఇంట్లో శవమై కనిపించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది.  ఆదివారం నీట్ పరీక్షకుకొన్ని గంటల ముందు జరిగింది. అతపే ఆత్మహత్య చేసుకున్నాడని, పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమయ్యాడనే ఆందోళనతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.ముఖ్యమంత్రి  స్టాలిన్ దీనిపై  తీవ్రంగా స్పందించారు.నీట్ బలిపీఠం మీద మరొక మరణం. విద్య ఒక అర్హతగా ఉండనివ్వండి .  రేపు మేము నీట్ కోసం శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాము. నీట్ ను  భారత ఉపఖండం యొక్క సమస్యగా తీసుకుందామని ప్రకటించారు.

గత వారం, కాంగ్రెస్ నేత   రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం "విద్యార్థుల కష్టాల పట్ల గుడ్డిగా" ఉందని నిందించారు. విద్యార్థుల బాధను గమనించి నీట్ పరీక్షను వాయిదా వేయండి. వారికి తగిన అవకాశం కల్పించండని కోరారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox