Breaking News

గుజరాత్ 17 వ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

13 th Sep 2021, UTC

గుజరాత్ 17 వ సీఎంగా భూపేంద్ర పటేల్  సోమవారం ప్రమాణ స్వీకారం చేసారు. గాంధీనగర్ లోని రాజ్ భవన్‌లో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్  ఆయనచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ  కార్యక్రమంలో  గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, హర్యానా సీఎంలు  ప్రమోద్ సావంత్,బసవరాజ్ బొమ్మాయ్,  శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. , కేంద్ర మంత్రులుఅమిత్ షా,మన్సుఖ్ మాండవియా, దర్శన జర్దోష్ మరియు పర్షోత్తం రూపాల కూడా  ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

భూపేంద్ర పటేల్ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ మరియు గుజరాత్ మాజీ సిఎం ఆనందీబెన్ పటేల్ కు సన్నిహితుడు.  భూపేంద్ర పటేల్ అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీతో పాటు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా పనిచేశారు.  2022 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి గెలవాలంటే పటేళ్ల మద్దతు తప్పనిసరి అని భావించిన బీజేపీ హై కమాండ్ వారిని దువ్వడానికి సీఎంగా పటేల్ ను నియమించినట్లు భావిస్తున్నారు. 

 ఎవరూ ఊహించని విధంగా సెప్టెంబర్ 11 న విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా నాకు ముఖ్యమైన బాధ్యతను ఇచ్చినందుకు నేను భాజపాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను పిఎం మోదీ జీ మార్గదర్శకత్వం పొందుతున్నాను. గుజరాత్ అభివృద్ధి ప్రయాణంలో నాకు లభించిన అవకాశం కోసం నేను ప్రధానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు.

  • Tags