Breaking News

కాంగ్రెస్ తో బెంగళూరుకు భద్రత వుండదు.. మాజీ సీఎం కుమార స్వామి

15 th Oct 2020, UTC

బెంగళూర్‌ :బెంగళూర్‌లోని రాజరాజేశ్వరినగర్‌ అసెంబ్లీ స్ధానానికి కాంగ్రెస్ , జేడీఎస్ లు రెండూ తమ అభ్యర్దులను బరిలో దింపి పరస్పర ఆరోపణలకు దిగాయి. ఈ రెండు పార్టీలు గత ప్రభుత్వంలో భాగస్వాములుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తమ పార్టీ అభ్యర్థి వి కృష్ణమూర్తి నామినేషన్‌ వేసిన అనంతరం జేడీఎస్‌ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రికుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ను టార్గెట్ చేసారు. ఇటీవలి బెంగళూరు అల్లర్లను ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ పార్టీతో బెంగళూర్‌లో భద్రత కరవవుతుందని వ్యాఖ్యానించారు.

ఇజే హెచ్‌డీ కుమారస్వామి కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీతో బెంగళూర్‌లో భద్రత కరవవుతుందని వ్యాఖ్యానించారు. బెంగళూరు అల్లర్లపై బీజేపీ మాదిరే కుమారస్వామి సైతం కాంగ్రెస్‌ లక్ష్యంగా విమర్శల దాడి పెంచారు. రాష్ట్ర పౌరులను కాంగ్రెస్‌ నేతలు కాపాడలేరని, బెంగళూరు దాడులకు వారే కుట్రదారులని కుమారస్వామి కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ చేతిలో బెంగళూరు నగర ప్రజలు సురక్షితంగా ఉండలేరని ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. 

మరోవైపు బెంగళూర్‌ అల్లర్లు పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు.జేడీఎస్‌, కాంగ్రెస్‌లు 2018లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు విభేదాలను పక్కనపెట్టి  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox