Breaking News

తెలంగాణలో ఉన్న మసీదులన్నింటిని తవ్వాలి.. శవం వస్తే మీది.. శివలింగం వస్తే మాది: బండి సంజయ్

26 th May 2022, UTC

Karimnagar: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన మందిర్-మసీదు వివాదాన్ని ఆయన తెలంగాణకు తీసుకొచ్చారు. కరీంనగర్ జిల్లాలో హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్న మసీదులన్నింటినీ తవ్వాలని తవ్వకాల్లో శవం వస్తే ఆ మసీదును మీకే వదిలేస్తామని, శివలింగం వస్తే మేము తీసుకుంటామని అన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ పై ఘాటు విమర్శలు చేశారు. 

ఉత్తరప్రదేశ్ లోని వారణాసి జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని బండి సంజయ్ చెప్పారు. ఇక్కడున్న మసీదులను తవ్వినా శివలింగాలు వస్తాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మదర్సాలను మూసేస్తామని తెలిపారు. మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి పట్టిన శనిని వదిలిస్తామని, రామరాజ్యాన్ని స్థాపిస్తామని అన్నారు. తెలంగాణకు పట్టిన శనిని కాషాయంతో కడిగేసి రామరాజ్యం స్థాపించి తీరుతాం. లవ్‌ జిహాదీ అంటే లాఠీ రుచి చూపిస్తాం. మత మార్పిడిలు చేస్తే మక్కెలిరగదీస్తాం.

రాష్ట్రంలోని మదర్సాలు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయి. వాటికి కంప్యూటర్లు అందజేసి ఆర్థిక సహాయం చేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మదర్సాలను రద్దు చేస్తాం. ఉర్దూ భాషను శాశ్వతంగా తొలగిస్తాం. మైనారిటీ రిజర్వేషన్లను కూడా రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు వాటిని వర్తింపజేస్తాం. అతి త్వరలో రజాకార్ల ఫైల్స్‌ సినిమా రాబోతోంది. రజాకారుల అకృత్యాలను తెలంగాణ ప్రజలకు చూపిస్తామని ఆయన అన్నారు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox