Breaking News

వెన్నుపోటు విషయమై తెలివిగా సమాధానం చెప్పిన బాలయ్య..!

08 th Jun 2020, UTC

నందమూరి బాలకృష్ణ ఇటు రాజకీయాల్లోనూ..అటు సినిమాల్లోనూ మంచి పేరునే గడించారు. అయితే అభిమానులపై గట్టిగ అరుస్తాడన్న కామెంట్ లు అక్కడక్కడా వినిపించినా..అదేంటో మరి ఆయన అభిమానులుకూడా బాలయ్యను అలాగే ఇష్టపడతారు. అయినా..కొట్టిన మురిపెంగానే చూసుకుంటారు. మా బాలయ్య బంగారం.. జై బాలయ్య వంటి నినాదాలతో నిత్యం బాలయ్య బాబు ని వెనకేసుకొస్తూనే ఉంటారు.
 
        అలాంటి బాలయ్య.. సినిమా ప్రమోషన్లకు తప్ప ఇతర ఇంటర్వ్యూ లకు రాడని ఓ నెగటివ్ టాక్ ఉంది. తాజాగా.. బాలకృష్ణ ఈ టాక్ ని చెరిపేయాలనుకున్నారో ఏమో వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ బిజీ గా అయిపోయారు. బాలకృష్ణ ఇంటర్వ్యూ ఇచ్చారంటే.. అందులో కచ్చితం గా ఎన్టీఆర్ ప్రస్తావన ఉండనే ఉంటుంది. తండ్రి మీద గౌరవంతో..టీడీపీ తరపున ఎమ్మెల్యే గా కొనసాగుతున్న బాలయ్య ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో వెన్నుపోటు గురించి మాట్లాడారు. అయితే.. ఈసారి కూడా తెలివిగా సమాధానం ఇచ్చారు ఈ నందమూరి వారసుడు. 
 
           ఇంటర్వ్యూలలో ఈ సారి సినిమాల కంటే ఎక్కువగా పాలిటిక్స్ పై ఊహించని విధంగా స్పందించారు. కేసీఆర్ మా నాన్నగారి ప్రియ శిష్యుడు అంటూ.. వైఎస్. జగన్మోహన్ రెడ్డి నా అభిమాని అని రెండు రాష్ట్రాల సీఎంల పై ఒక కామెంట్ కూడా చేసిన సంగతి తెలిసిందే. మరో వైపు... సినిమాలు. రాజకీయాలు రెండు వేరు వేరని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఆయన తండ్రి గారు ఎన్టీఆర్ గారు తెలుగు దేశం పార్టీ పెట్టినపుడు కూడా అపోజిషన్ పార్టీ ఐన కాంగ్రెస్ పార్టీ లో తొంభై శాతం మంది ఆయన అభిమానులే ఉండేవారని బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. వెన్నుపోటు, లక్ష్మీ పార్వతి వివాదాల గురించి ఆయన ఒకే ఒక్క మాట తో చెక్ పెట్టారు. నాన్నగారి జీవితం లో ఎన్ని తప్పులు పొరపాట్లు జరిగినా...అదంతా ఓ విధిరాత అని బాలకృష్ణ కామెంట్ చేసారు. ఆ వివాదాల గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఆ విషయాలన్నిటిని ఒక డెస్టిని అంటాను. జరగాల్సింది జరిగిపోయింది. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అని బాలకృష్ణ కామెంట్ చేసారు. మరో వైపు.. నాన్నగారు ఎన్ని సేవ కార్యక్రమాలు చేసారో.. ఆయన గొప్పతనం ఏమిటో..అందరికి తెలుసనీ ఆయన చెప్పుకొచ్చారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox