Breaking News

ఈ నెల 16 నుంచి ఏపీ లో అసెంబ్లీ సమావేశాలు..?

07 th Jun 2020, UTC

జూన్ 16 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభ సభ, శాసనమండలి సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మార్చిలో ఓటాన్‌ అకౌంట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అయితే.. ముందుగా ఈ నెల 11 వ తేదీ న కాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం లో చర్చించిన తరువాత శాసన మండలి సమావేశాల విషయమై సీఎం జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. 
              శాసనసభ సభ, శాసనమండలి సమావేశాల్లో.. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయ సభల సభ్యులనుద్దేశించి ప్రసంగిస్తారు. ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగించిన అనంతరం సభ వాయిదా పడుతుంది. ఈ క్రమంలో బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమై..ఎన్ని రోజులపాటు సమావేశాలను నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? తదితర అంశాలను ఖరారు చేయనుంది.
              మరోవైపు.. ఈ నెల 19 న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీరికి ఓట్లు వేయడానికి  శాసనసభ్యులు అసెంబ్లీకి రావాల్సి ఉంటుంది. 16వ తేదీ నుంచి బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ 18న ఆర్థికశాఖ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ పరిరక్షణ బిల్లుతో పాటు, కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ఓ వైపు.. కరోనా ప్రబలుతున్న కారణం గా..సాధ్యమైనంత తక్కువ రోజుల్లో ఈ సమావేశాలు జరగాలని నిర్ణయించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox