Breaking News

కేసీఆర్ కు దొరకని ప్రధాని, కేంద్రమంత్రుల అపాయింట్ మెంట్

24 th Nov 2021, UTC

వరి సాగుపై కేంద్రంతో ఏదో ఒకటి తేల్చుకొనే వస్తానని ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌‌కు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్లు దొరకలేదు. దీనితో చేసేదేమీ లేక  తుగ్లక్‌‌ రోడ్డులోని తన నివాసానికే పరిమితమయ్యారు. బుధవారం కూడ అపాయింట్ మెంట్ దొరక్కపోతే కేసీఆర్ సాయంత్రం బయలు దేరి హైదరాబాద్ వచ్చే అవకాశముంది.

రాష్ట్రంలో పండిన మొత్తం వడ్లను కేంద్రమే కొనుగోలు చేయలని, కృష్ణా, గోదావరి జలాల పునః పంపిణీ కోసం కొత్త ట్రిబ్యునళ్ల ఏర్పాటు, రాష్ట్ర ప్రాజెక్టులకు పర్మిషన్‌‌ పై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవడానికే ఢిల్లీకి వెళ్తున్నానని కేసీఆర్ శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ అంశాల్లో ప్రధానిపై ఒత్తిడి తీసుకువస్తానని చెప్పారు. ప్రధాని మోడీ, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ను కేసీఆర్‌‌ కలవాలని షెడ్యూల్‌‌ రూపొందించుకున్నారు. షెకావత్‌‌ జోధ్‌‌పూర్‌‌లో ఉండటంతో ఆయన్ను కలవడం సాధ్యం కాలేదు. ప్రధాని ఢిల్లీలోనే ఉన్నా అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. 

కేసీఆర్ మంగళవారం ఫిరోజ్ షా రోడ్ లోని రాజ్య సభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయన ఇచ్చిన లంచ్‌‌కు సీఎం హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తుగ్లక్ రోడ్ లో  ఆయన నివాసానికి చేరుకున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox