Breaking News

మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకున్న ఏపీ సర్కార్

22 nd Nov 2021, UTC

మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు అడ్వకేట్ జనరల్హైకోర్టుకు తెలిపారు.సోమవారం నాడు ఉదయం ఏపీ కేబినెట్  సమావేశం అత్యవసరంగా జరిగింది. ఈ సమావేశంలో మూడు రాజధానులపై ఏపీ సర్కార్ తీసుకొన్ని చట్టాన్ని వెనక్కి తీసుకొన్నట్టుగా అడ్వకేట్ జనరల్ ఇవాళ  ఏపీ హైకోర్టుకు తెలిపారు. ఈ విషయమై అసెంబ్లీలో ఏపీ సీఎం జగన్ ప్రకటన చేస్తారని  అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

2020 జనవరి 20వ తేదీన ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై ప్రవేశపెట్టిన బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.   అమరావతిలో శాసనస రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో ఏపీ సీఎం  వైఎస్ జగన్ ప్రకటించారు.  అమరావతికి సంబంధించి చంద్రబాబు సర్కార్ ఏర్పాటు చేసిన  సీఆర్డీఏ ను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపింది.  ఏపీ శాసన సభ నుండి  2020 జూన్ 17న రెండోసారి ఈ బిల్లులను ఏపీ శాసనమండలికి పంపారు. అయితే ఈ బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టడానికి ముందే శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. 

మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకొన్న ఏపీ సర్కార్ మరో కొత్త బిల్లును ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు కొత్త బిల్లును ఏపీ సర్కార్ ఇవాళ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox