Breaking News

ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప.. అభివృద్ది శూన్యం :ఆనం రామనారాయణ రెడ్డి

04 th Jun 2020, UTC

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు తాము ఏడాదిలోనే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని చెప్పారు.
అయితే నెల్లూరు జిల్లాలో సీనియర్ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి  ప్రభుత్వ పనితీరు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప నా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. సీఎం జగన్ లేఖకే దిక్కు లేని పరిస్థితి. మంత్రులు అధికారులు జగన్ లేఖనే పట్టించుకోవడం లేదు. మరో ఏడాది చూస్తా. పనులు జరగకపోతే ప్రభుత్వాన్ని నిలదీస్తా. నెల్లూరు జిల్లాలో జలదోపిడీ లెక్కలు తేల్చాలి అని ఆనం చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి.

జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన ఆనం.. గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వెంకటగిరి టికెట్ దక్కించుకుని విజయం సాధించారు. అయితే మంత్రివర్గంలో ఆనంకు చోటు దక్కుతుందని చాలా మంది అనుకున్నా..  చివరకు  నిరాశే మిగిలింది. ఈ క్రమంలో మంత్రి పదవి దక్కకున్నా ఏమాత్రం అసంతృప్తి వెళ్లగక్కకుండా ఉండిపోయిన ఆనం... ఇప్పుడు జగన్ ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో గళం వినిపించారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox