Breaking News

అమరావతి రైతులకు.. ఈ దుస్థితి బాబు వల్లేనా?

06 th Jul 2020, UTC

అమరావతినే పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ.. భూములిచ్చిన ఆ ప్రాంత రైతులఉద్యమం  - తాజాగా 200 రోజులు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే . టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు ,  చంద్రబాబు నిర్మించ తలపెట్టిన ఒక రాజధాని ప్రాంతం -  రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు  బ్రాండ్ ఉంటుందన్న  తలంపుతో - జగన్మోహన రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు బీజం వేశారా? సీఎం జగన్ అమరావతిని మార్చేయాలని ఎందుకు   పట్టుబడుతున్నారు? ఆ ప్రాంత రైతులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఎందుకు అంతగా కోరుతున్నారు? అసలు , అమరావతి పోరాటం ఇంకెంత దూరం పోతుంది ? 

అమరావతి ఉద్యమం మొదలై ఇప్పటికే , 200 రోజులు దాటిపోయింది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటన్నదానిపై - వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.
రాజధాని పేరుతో ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున భవనాల నిర్మాణం పూర్తవ్వగా, మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పుడు రాజధానిని తరలించడం వల్ల అవి నిరుపయోగంగా మారడంతో పాటు, అక్కడ భారీ ఎత్తున  ప్రభుత్వానికి భూములు అప్పగించిన వారిలో ఆందోళన నెలకొంది. టీడీపీ , ఈ వ్యవహారం రాజకీయ కోణంలో హైలెట్ చేస్తూ, వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో ప్రభుత్వం కూడా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా అమరావతి ఆందోళనలు 200 రోజులు పూర్తి చేసుకోగా ,  ప్రస్తుతం కరోనా కారణంగా అక్కడ జన సమూహం కాస్త తక్కువగానే కనిపిస్తున్నా -  కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చేస్తే, అమరావతి ఉద్యమం మరింత తీవ్రస్థాయిలో పెరిగే అవకాశం లేకపోలేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి . వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న జగన్ - అమరావతి లో ఒక కదలిక తీసుకు రావాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే , రీసెంట్ గా బొత్స లాంటి వైసీపీ నాయకులు, అమరావతిలో పర్యటించినట్లు చెప్పుకుంటున్నారు . 
నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు. కానీ ఆయన ఐదేళ్ల పాలన కాలంలో చేపట్టిన నిర్మాణాలు చాలావరకూ పూర్తయినా - ఆశించిన పురోగతి మాత్రం సాధ్యపడలేదు. బాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. మూడు రాజధానుల అంశాన్ని తెర మీదకు తెచ్చారు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా కొనసాగిస్తూ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్ ఏర్పాటు దిశగా జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది.
ఈ క్రమంలో అమరావతి పంచాయతి చిలికి చిలికి గాలివానగా మారి , శాసన మండలి రద్దు నిర్ణయానికి దారితీసిన సంగతి తెలిసిందే .  మండలి ఎప్పుడు రద్దవుతుందనేది ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. మరోవైపు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని.. భూములిచ్చిన గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ సర్కారు మాత్రం అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ మాత్రమే కొనసాగుతుందని చెబుతోంది.
జగన్‌కు అసలు అమరావతి అంటేనే ఇష్టం లేదని.. బాబుకు పేరొస్తుందనే ఉద్దేశంతోనే ఆయన రాజధానిని మారుస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. 
నవ్యాంధ్ర  రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో ఇప్పటికే ఎన్నో  సంచలన ఘటనలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి.   ఈ ఉద్యమం రాజధాని పరిధిలోని గ్రామాల్లోనే కొనసాగుతున్నా  - ఎక్కడా ఏ మాత్రం పట్టు సడలని రీతిలో  సాగుతుండగా... ఆందోళనల్లో రైతులు , మహిళలు , విద్యార్థులు పాలుపంచుకుంటున్న పరిస్థితి.
అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, అధికారంలోకి వచ్చిన జగన్.. రాజధాని విషయంలో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు . కేవలం ఒక వర్గానికి మేలు చేయడం కోసమే టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందని పలుమార్లు సంచలన ఆరోపణలు చేసారు . అంతేకాకుండా, అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపిస్తూ.. మూడు రాజధానుల ప్రక్రియను తెరమీదకు తెచ్చారు. ఈ నేపథ్యంలో రాజధానికి భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న అమరావతి రైతులకు వైసీపీ ప్రభుత్వం  నేటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోంది.
అయితే మొదటి నుండే అమరావతిపై భిన్న ప్రకటనలు చేస్తోన్న వైసీపీ మంత్రులు - తమ ప్రకటనలతో అమరావతి రైతులకు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారన్న వాదనలు కూడావినిపిస్తున్నాయి . దీనిపై ప్రతిపక్ష టీడీపీ నేతల నుండి విమర్శలు వస్తున్నాయి . రీసెంటుగా వైసీపీ నేత బొత్సా  అమరావతిలో పర్యటించడం , మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు కూడా గందరగోళానికి దారితీసాయి .
రాజధాని గ్రామాల్లో బొత్స పర్యటిస్తూ అక్కడి పెండింగ్ పనులపై దృష్టిసారించడం - స్ధానిక నేతలతో వ్యూహాత్మక సమావేశాలు జరపడం చర్చనీయాంశమైంది. ఆగిపోయిన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల ప్రతినిధులతోనూ బొత్స సమావేశమయ్యారు. అమరావతిలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు  18 వేల కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో బొత్స పెండింగ్ నిర్మాణాలపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. అమరావతిలో పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని విస్మరించడం లేదనే సంకేతాలను రైతుల్లో పంపాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.
అందుకే పెండింగ్ పనులను పూర్తి చేయడం ద్వారా అమరావతిలోనూ అభివృద్ధి వదిలిపెట్టలేదనే సంకేతాలను విపక్షాలకు సైతం పంపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమరావతిలోని పెండింగ్ పనులను పూర్తి చేసి, వాటిలో ప్రభుత్వానికి అవసరమైన నిర్మాణాలను ఉంచుకొని... మిగతా నిర్మాణాలను ఆసక్తి ఉన్న ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు . తద్వాదా వచ్చిన సొమ్ముతో ఖజానాను కొంత మేర భర్తీ చేసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. శాసన రాజధాని అయిన అమరావతిలో అసెంబ్లీతో పాటు మరి కొన్ని నిర్మాణాలు మినహా వేరే వాటితో ప్రభుత్వానికి పెద్దగా పనిలేనందున జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 
అయితే , ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని, రాష్ట్రంతో మూడు ముక్కలాట ఆడుతున్నారని చంద్రబాబు తాజాగా జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ మాట తప్పాడని,  మడమ తిప్పాడని… ముందు అమరావతి రాజధానిగా తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పిన జగన్ - ఆ తర్వాత ముంపు ముప్పు ఉందని , ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని కల్లబొల్లి మాటలతో రాజధానిని అమరావతి నుంచి షిఫ్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
 
2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు - పోలవరం, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ ప్రచార బరిలో దిగగా... వైసీపీ మాత్రం ఆ రెండు అంశాల కంటే... నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి... ప్రచారం సాగించింది. ఇందుకు ప్రధాన కారణం... ఆ పార్టీ అధికారంలోకి వస్తే, పోలవరం పనులను నిలిపేస్తుందనీ, రాజధానిని అమరావతి నుంచీ మరో చోటికి తరలించేస్తుందనే వాదన అప్పట్లో వినిపించింది. దీనిపై టీడీపీ జోరుగా ప్రచారం చెయ్యడంతో... అప్పట్లో వైసీపీ నేతలు... ఆ వాదనను తప్పుపడుతూ కౌంటర్లు ఇచ్చారు. కానీ...  వైసీపీ అధికారంలోకి వచ్చాక... పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్‌ నిర్ణయం తీసుకోవడం ఒక అంశమైతే... రాజధాని అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది .
అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం కంటే డబుల్ అవుతోందని వైసీపీ ఆరోపించింది . దాని వలన ప్రజాధనం దుర్వినియోగమవుతోందని చెప్పుకొచ్చింది . కృష్ణానది వరదలతో, అమరావతిలో మునిగిపోయే ప్రాంతాలు ఉన్నాయన్న ఏపీ సర్కార్... వరదల నుంచి రక్షణ పొందేందుకు కాల్వలు, జలాశయాలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పింది . దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే . ఇక , ఒకసారి వెనక్కు వెళితే - రాజధానికి సంబంధించి శివరామకృష్ణన్ నిపుణుల కమిటీ... ఎక్కడ రాజధానిని నిర్మించాలో చెప్పలేదు. కానీ.... విజయవాడ-గుంటూరు పరిసరాల్లో రాజధాని ఉండాలని 53 శాతం మంది కోరుకుంటున్నారని మాత్రం చెప్పింది. అందువల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. రాజధానిలో భవనాలు, ఇతరత్రా నిర్మాణాల కోసం 27,097 కోట్లు, ఏపీ అభివృద్ధికి 4,49,505 కోట్లు అవసరమని అంచనా వేసింది. రైతులు 34,010 ఎకరాల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. వాటిలోంచీ రాజధాని ప్రాంతంగా 8603 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టింది. ఆ వెంటనే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది.
ఇక , వైసీపీ సర్కార్ వచ్చాక , రాజధానిలో నిర్మాణాలు ఆగిపోయాయి. రోడ్ల పనులు కూడా సాగట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. కేంద్రం కూడా పెద్దగా సహకరించట్లేదు.   వైసీపీ ప్రభుత్వం రాజధానిపై గట్టిగా అడగకపోవడాన్నీ అనుకూలంగా తీసుకుంటున్న కేంద్రం... ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి బడ్జెట్‌లో తక్కువ మొత్తమే   కేటాయించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుండి వెలువడిన మూడు రాజధానుల ప్రకటన - అమరావతి ప్రాంత రైతులు నిరసన దీక్షలకు దిగేందుకు కారణమైంది . అమరావతి రైతుల ఉద్యమానికి మొదట్లో బాగా కవరేజ్ ఇచ్చిన మీడియా - కొన్నాళ్లుగా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. మీడియా మేనేజ్ మెంట్లు ఎపుడో ఈ ఇష్యూని అటకెక్కించేశాయి. జనాలకు ఆసక్తి లేని, కేవలం కొన్ని వర్గాల పోరాటంగా మిగిలిన వారు చూస్తున్నారు. ఫలానా రోజుకు చేరుకున్న ఉద్యమం అంటూ తేదీలు, అంకెలు చెప్పుకోవడం తప్ప అసలు దాని ప్రభావం ఏపీలో ఉందా అన్నది అందరిలో కలుగుతున్న ఆలోచన. కానీ , 200 రోజులు దాటినా అమరావతి రైతులు మాత్రం పోరాటం ఆపడం లేదు .   మరో వైపు, ఈ విషయంలో మొదటి నుంచి తెగ హడావుడి చేసిన చంద్రబాబు కూడా ఈమధ్య అమరావతి ఆందోళనలను సరిగ్గా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి .
 
రాష్ట్రం వున్నఆర్ధిక పరిస్థితుల్లో ఒక్క రాజధానిని అభివృద్ధి చేసుకోవడమే కుదరట్లేదు. అలాంటిది, ఏకంగా మూడు రాజధానులంటూ.. ‘ ‌ అమరావతి ప్రాజెక్ట్’ ని‌ జగన్‌ సర్కార్‌ అటకెక్కించింది. గడచిన ఏడాది కాలంలో అమరావతిలో ఒక్క నిర్మాణమూ జరగకపోవడమే ఇందుకు నిదర్శనం.
ఇదిలా వుంటే, ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో పర్యటించి , చంద్రబాబు హయాంలో నిర్మితమైన పలు అధికారిక భవనాల్ని పరిశీలించారు. అంతకు ముందు ఆయనే, అమరావతిని స్మశానంతో పోల్చారు.. అమరావతిని ముంపు ప్రాంతంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో బొత్స, అమరావతిలో పర్యటించడంపై పలు అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.
‘అమరావతిపై వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సరికొత్త కుట్రకు తెరలేపింది’ అంటూ టీడీపీ ఆరోపిస్తోన్న విషయం కూడా తెలిసిందే. ఇక, తాజాగా రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తికరమైన గాసిప్స్‌ అమరావతికి సంబంధించి సర్క్యులేట్‌ అవుతున్నాయి. ‘అమరావతిలో నిర్మితమైన భవనాల్ని, ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం , అవసరం లేనివాటిని  విక్రయించేందుకోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ  టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు..  
సోషల్‌ మీడియా వేదికగా అమరావతిపై ఈ అంశం చుట్టూ కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్‌ దర్శనమిస్తున్నాయి. ‘సేవ్‌ అమరావతి’ అంటూ ఆయా అంశాల్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ, అమరావతిపై ప్రభుత్వం ఆలోచన ఏంటి.? "శాసన రాజధాని మాత్రమే కాదు, అమరావతి మరింత అభివృద్ధి చెందుతుంది - విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వెళ్ళడం ఒకింత ఆలస్యమయ్యేలా వుంది..’ అంటూ వైసీపీ వర్గాల నుంచి వస్తోన్న ప్రచారంలో నిజమెంత.? అమరావతిపై కొత్త కుట్ర.. అంటూ టీడీపీ చేస్తోన్న ఆరోపణల్లో నిజమెంత.? అన్న విషయాలు కలం గడిస్తేగానీ తెలియవు . కానీ, రాజధానిని అమరావతి నుండి తరలించొద్దంటూ రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మాత్రం తమ ఉద్యమాన్ని యధాతథంగా కొనసాగిస్తూనే వున్నారు.
ఇక , అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తున్నారు. ఐదేళ్లలో అమరావతి కోసం ఏమీ చేయలేని చంద్రబాబు.. ఇప్పుడు రైతులతో స్పాన్సర్డ్ ఉద్యమం నిర్వహిస్తూ వారిని మభ్యపెట్టాలని చూస్తున్నారని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే కాంక్షతో మూడు రాజధానులు తీసుకొస్తుంటే చంద్రబాబుకు అంత బాధెందుకని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అమరావతి ఉద్యమం విషయంలో చంద్రబాబు హంగామా చేస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. ఏం అన్యాయం జరిగిందని ఉద్యమాలు చేస్తున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మూడు రాజధానులు ఏర్పాటవుతున్నాయని, ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని నిర్మించలేకపోవడం కూడా ఇందుకు కారణమని కన్నబాబు విమర్శించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల ఆకాంక్షలు చంద్రబాబుకు అక్కర్లేదా అని ఆయన ప్రశ్నించారు. ఐదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని విపరీతంగా వృథా చేశారని కన్నబాబు విరుచుకుపడిన విషయం తెలిసిందే .
 
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతు కుటుంబాలతో పురుడుపోసుకున్న అమరావతి ఉద్యమం..  జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విస్తరిస్తూ - సమస్యను జాతీయ, అంతర్జాతీయ వేదికలమీదకు కూడా తీసుకెళుతోంది. NRI ల నుండి సైతం మద్దతు లభిస్తోంది . రైతు కుటుంబాల బాధ, ఆవేశం నుంచి పుట్టిన ఈ ఉద్యమం ఎక్కడా, ఎప్పుడూ దారి తప్పలేదు. ఇప్పుడు ఉద్యమకారుల్లో  బాధ, ఆవేశం మాత్రమే కాదు.. పట్టుదల కూడా పెరిగింది. ఎలాంటి త్యాగాలు చేసైనా అమరావతిని నిలబెట్టుకోవాలనే స్ఫూర్తి నరనరాన ఇమిడింది. అందుకే ఇన్ని రోజులైనా ఉద్యమ సెగ ఏ మాత్రం తగ్గలేదు సరికదా మరింత పెరుగుతోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి . అసలింతకీ , జైౖ అమరావతి అనేది రైతు ఉద్యమమా? మహిళా ఉద్యమమా? అంటే - రాజధాని గ్రామాలను ఒక్కసారి అలా చుట్టేసి వస్తే.. అందరూ దీన్ని మహిళా ఉద్యమమనే చెబుతారు. ఎందుకంటే  ఏ దీక్షా శిబిరాన్ని సందర్శించినా ఎక్కువమంది మహిళలే కనిపిస్తున్నారు. తొలినుండి ఏ ప్రదర్శన.. ర్యాలీ..ఆందోళన చూసినా ముందున్నది మహిళలే. ప్రభుత్వ తీరుపై గళమెత్తుతున్నదీ మహిళామణులే. అన్యాయం చేయొద్దని రోదిస్తున్నదీ మహిళలే. రాజధాని గ్రామాల మహిళలు నేడు ఇల్లూవాకిళ్లూ మరిచిపోయారంటే అతిశయోక్తి కాదు. వారికి దీక్షా శిబిరాలు తప్ప మరేవీ కానరావడంలేదు. పండుగైనా, పబ్బమైనా అక్కడే. ఉద్యమ యుద్ధంలో తమను గెలిపించే మహాశక్తివంతమైన ఆయుధగారాలుగా దీక్షా శిబిరాలను భావిస్తున్నారు .  
ఓ పక్క గాంధేయమార్గంలో పోరాడుతూనే ఇంకో పక్క న్యాయ పోరాటాన్ని కూడా రైతులు కొనసాగిస్తున్నారు. హైకోర్టులో పలు కేసులు వేశారు. అవన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి.    ఈ 200 రోజుల ఉద్యమంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, తిండీ తిప్పలు లేక పస్తులున్నా కానీ - మహిళలు, రైతులు చిన్నాపెద్దా, ముసలి ముతక అనేతేడా లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. లాఠీ దెబ్బలు,   కేసులు…, మహిళలపై కేసులు, కొట్టడం, తిట్టడం చివరకు కులంరంగు పులమాలని చూడటం .... ఒక్కటేమిటి వారు ఎదుర్కొనిదంటూ ఏమీలేదు . ఎన్ని ఆటంకాలు వచ్చినా వెన్నుచూపలేదు.
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతు జేఏసీ… ఉప రాష్ట్రపతి నుంచి కేంద్ర మంత్రులదాకా ఎంతోమందిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుంది. చివరికి కోర్టులను కూడా ఆశ్రయించింది. ఇప్పటికే ఎన్నో కోర్టు కేసుల్లో ఓటమి పాలైనా సరే జగన్ సర్కారు తీరులో మాత్రం మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు . మొండి వైఖరిని మాత్రం వీడలేదు.
200 రోజులకుపైగా చేస్తోన్న ఉద్యమంలో ప్రభుత్వం తమను ఎన్నో రకాలుగా వేధించిందని రైతులు మండిపడుతున్నారు. కౌలు బకాయిలు ఇంతవరకు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  రైతు కుటుంబాల నుంచి వచ్చామని చెప్పే ప్రభుత్వ నాయకులకు రైతులగోడు పట్టదా అంటూ నిలదీస్తున్నారు. దళితులు, బిసిలు, ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబాల ఘోష మీకు వినపడటంలేదా అంటూ మండిపడుతున్నారు. ఇక , తమకు జరగుతున్న అన్యాయంపై  రైతుల పోరాటానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్   మద్దతుగా నిలుస్తూ వచ్చారు . తాజాగా పవన్ మరోమారు స్పందించారు .
 అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తోన్న పోరాటంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని నిర్ణయించారు కాబట్టి రైతాంగం తమ 34 వేల ఎకరాల పంట భూములను త్యాగం చేశారని ఆయన జనసేన పార్టీ తరపున చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాబోదని చెప్పుకొచ్చారు.
తమ పాలన వచ్చింది కాబట్టి రాజధానిని మార్చుకుంటామని ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం రైతాంగాన్ని అవమానించడమేనని తమ పార్టీ మొదటి నుంచి చెబుతోందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజధానిని పరిరక్షించుకునేందుకు రైతులు 200 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారని చెప్పారు. బీజేపీతో కలిసి రైతులకు అండగా నిలబడతామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 29 వేల మంది రైతుల త్యాగాలను వృథా కానివ్వబోమని తేల్చి చెప్పారు.
ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తదుపరి వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అంతే తప్ప గత ప్రభుత్వం వేరు మా ప్రభుత్వం వేరు అనడం ప్రజాస్వామ్య విధానం కాదన్నారు పవన్. రైతులు తమ భూములు ఇచ్చింది ప్రభుత్వానికె తప్ప, ఒక వ్యక్తికో పార్టీకో కాదన్నారు. కాబట్టి ఆరోజు భూములు ఇచ్చేటప్పుడు  ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలు విషయంలో కూడా ప్రభుత్వం అలక్ష్యం ప్రదర్శించడం ఎంత మాత్రం భావ్యం కాదన్నారు పవన్. గత ఏడాది కూడా నిరసనలు చేస్తే తప్ప, కౌలు నిధులు విడుదల చేయలేదన్నారు.
ఈసారి కూడా అదే పరిస్థితి అన్నారు. కౌలు చెల్లింపులకు జీవో ఇచ్చారు తప్ప నిధులు విడుదల చేయలేదన్నారు పవన్ . అయితే , వైసీపీ శ్రేణులు మాత్రం అమరావతి ఉద్యమాన్ని తేలిక చేసి మాట్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి .
 
వైసిపి నెగ్గగానే ముందుగా అందరికీ వచ్చిన సందేహం - అమరావతి రాజధానిగా ఉంటుందా? లేక జగన్‌ తనకు కావలసిన చోటకి తరలించుకుని పోతాడా? అమరావతినే కొనసాగించి ,   ప్రపంచ స్థాయి రాజధాని కలను తను సాకారం చేస్తాడా? ఉమ్మడి రాజధానిగా యింకో ఐదేళ్ల పాటు హక్కున్న హైదరాబాదుకు - రాజధానిని పట్టుకుపోతాడా? అమరావతికై భూములిచ్చిన రైతులకు బాబు చేసిన హామీలను నెరవేరుస్తాడా?  బాబైతే రాజధాని కట్టగలడన్న నమ్మకంతో భూములిచ్చాం - నీపై మాకు ఆ నమ్మకం లేదు - వెనక్కి యిచ్చేయ్‌' అనే రైతుల మాట మన్నిస్తాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సందేహాలు. 
ఏది ఏమైనా , మూడు రాజధానుల ప్రభుత్వ నిర్ణయంలో మార్పయితే ప్రస్తుతానికి కనిపించడంలేదు . కానీ , అమరావతి రైతుల విషయంలో మాత్రం స్పష్టత రావాలి . ఇప్పటికే ప్రభుత్వం వచ్చి , ఏడాదిన్నర గడిచిపోయింది .  భూములిచ్చిన తమకు ప్రభుత్వం న్యాయం చేయాలన్న డిమాండ్ ను , ప్రభుత్వం మన్నిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే .

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox