Breaking News

జలవిహార్ లో అలయ్ బలయ్

18 th Oct 2021, UTC
జలవిహార్ లో అలయ్ బలయ్

హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో ఏళ్ల తరబడి సాంప్రదాయంగా  అలయ్ బలయ్  కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెలిసిందే. ఆదివారం జలవిహార్ లో జరిగిన  ఈ కార్యక్రమాన్ని  గవర్నర్‌ తమిళిసై ప్రారంభించారు. . సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత కళాకారులతో కలిసి గవర్నర్‌ స్టెప్పులు వేశారు. గిరిజన మహిళల నృత్యాలు, ఒగ్గు డోలు విన్యాసాలు, పెద్దపులుల వేసాలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి.

అలయ్‌ బలయ్ అంటేనే ఒక జోష్. ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం. పలకరించుకోవడం. పాతవన్నీ మరిచిపోవడం.  ఇలా వుండగా  అలయ్‌ బలయ్‌ కార్యక్రమం అద్భుతంగా ఉందని జనసేన పార్టీ అధ్యక్షుడు  పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఇది ఎంతో స్ఫూర్తిదాయకమని, ఇలాంటి కార్యక్రమాలు ఉండాలని చెప్పారు.ఈ కార్యక్రమానికి హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌, సినీనటుడు కోట శ్రీనివాసరావు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తదితరులు సైతం హాజరయ్యారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox