Breaking News

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్

22 nd Jan 2022, UTC

UP Assembly elections:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తొలిసారిగా పోటీ చేయనున్నారు. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారని పార్టీ తెలిపింది.  ఈ జిల్లా సంప్రదాయంగా ఎస్పీకి కంచుకోటగా ఉంది.అజంగఢ్ జిల్లాలోని గోపాల్‌పూర్ స్థానం నుంచి అఖిలేష్ పోటీ చేస్తారని కొద్ది రోజులకిందట ఊహాగానాలు వెలువడ్డాయి.

అజంగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ  ఎంపీ గా వున్నఅఖిలేష్ యాదవ్ ఎన్నడూ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయలేదని గమనించాలి. 2012లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.అఖిలేష్ యాదవ్ తండ్రి మరియు సమాజ్ వాదీ  వ్యవస్దాపకుడుములాయం సింగ్ యాదవ్ ఐదుసార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మెయిన్‌పురిలోని ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో కర్హాల్ ఒకటి.

ప్రస్తుతం కర్హల్ ఎమ్మెల్యేగా సమాజ్ వాదీ పార్టీకి చెందిన సోబరన్ సింగ్ యాదవ్ ఉన్నారు. 2017లో, అతను 1,04,221  ఓట్లతో ఈ సీటును కైవసం చేసుకోగా, అతని సమీప పోటీదారు, బిజెపికి చెందిన రామ శాక్య 65,816 ఓట్లను సాధించాడు. 1993 నుంచి ఎస్పీ ఈ సీటును ఏడుసార్లు గెలుచుకుంది. 2002 ఎన్నికల్లో బీజేపీ కర్హాల్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి 

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox