Breaking News

ఏ రకంగా చూసినా లోకేష్‌కు సమ ఉజ్జీనే.. డౌటేలేదు:విజయసాయి రెడ్డి

12 th Jun 2020, UTC

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్‌ నాయుడుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది.. అజ్ఞానం బయటపడదు. రామ్మోహన్‌ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్‌పోజ్‌ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేష్‌కు సమ ఉజ్జీనే.. డౌటేలేదు’ అని ట్వీట్‌ చేశారు.

.టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవమని తెలిసి కూడా బరిలో బడుగులను దింపి రాజకీయ లబ్ధి పొందుతున్నారని ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.

‘భోగాలు మీవి త్యాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీలవా? రాజ్యసభ సీట్లు గ్యారంటీగా గెలుస్తారనుకున్నప్పుడు కనకమేడల లాంటి వారు అభ్యర్థులుగా ప్రత్యక్షమవుతారు. బలం లేక  ఓటమిచెందే సమయంలో బడుగు వర్గాల అభ్యర్థులు బలిపశువులవుతారు. ఈనెల19న మీ బలం ఎంతో, వెంట ఉండేది ఎవరో, వదిలి పోయేది ఎవరో తెలిసి పోతుంది’ అని ట్వీట్‌ చేశారు.
సె
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ లో వున్న సంఖ్యాబలం ప్రకారం టీడీపీ నుంచి రాజ్యసభకు  అభ్యర్దుల ఎంపిక కష్టమే. అందువలనే చంద్రబాబు బీసీ అభ్యర్దులను ఎంపిక చేసారని విజయసాయి రెడ్డి అన్నారు. అదే అధికారంలో వున్నపుడు ఎవరిని నిలబెట్టినా గెలుపు తధ్యమన్న పరిస్దితుల్లో పెట్టుబడిదారులను, తన సన్నిహితులను రాజ్యసభ అభ్యర్దులుగా ఎంపిక చేసుకున్నారని ఆరోపించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox