Breaking News

కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ ఫెయిల్: బండి సంజయ్

09 th Jul 2020, UTC

కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం విఫలం చెందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కరోనా మరణాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం గాలికొదిలేసింది కాబట్టే.. కరోనా కట్టడికి గవర్నర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. దేశంలో ఎక్కడా గవర్నర్ ఆస్పత్రులను పరిశీలించిన పరిస్థితి లేదని పేర్కొన్నారు.

కరోనా కట్టడికి కేంద్రం కూడా ప్రత్యేక నిధులు కేటాయించిందని తెలిపారు. ఆస్పత్రుల్లో బెడ్స్ లేక కరోనా  బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో చేసినన్ని కరోనా టెస్టులు తెలంగాణలో చేయటంలేదని విమర్శించారు. తీరా ప్రశ్నిస్తే ఐసీఎంఆర్ గైడ్ లెన్స్ పేరుతో మంత్రులు ఎదురుదాడి చేయటం దారుణం అన్నారు. ప్రభుత్వంపై నమ్మకం లేకనే ప్రజలు సమస్యల పరిష్కారం కోసం రాజ్‌భవన్ బాట పట్టారని స్పష్టం చేశారు.

క్రైమ్‌ను కంట్రోల్  చేయడంలో పోలీసులు ఫెయిల్.. రాజాసింగ్

నగరంలో క్రైమ్‌ను కంట్రోల్  చేయడంలో హైదరాబాద్ పోలీసులు విఫలమయ్యారని ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు.  నగరంలో ఈ ఆరు నెలల్లో క్రైమ్ రేట్ తగ్గింది అని పోలీస్ కమిషనర్ స్టేట్మెంట్ ఇచ్చారు.  సీపీ అంజనీకుమార్‌కు గుర్తు చేస్తున్న.. 20 రోజుల్లోపే 6 హత్యలు జరిగాయి. దొంగతనాలు, ముర్డర్లు, అత్యాచారాలు ఎన్ని జరిగాయో మీరే చెప్పాలి అని ప్రశ్నించారు.

నగరంలో ఎక్కడ చూసిన దొంగతనాలు, ముర్డర్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ క్రైమ్ రేట్ తగ్గినట్లు స్టేట్మెంట్‌లు పోలీస్ కమిషనర్ ఇస్తున్నారా? లేక... ఫామ్ హౌస్‌లో కూర్చొని క్రైమ్ తగ్గినట్లు చెప్పమని పెద్దలు ఆదేశిస్తున్నారా ? అర్థం కావడం లేదు అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox