Breaking News

సాధినేని యామిని పదవి పై మాధవీలత సెటైర్లు..!

12 th Jun 2020, UTC

టీడీపీ నుండి బీజేపీ లో చేరిన యామిని సాధినేనిని ఉద్దేశిస్తూ 'మల్లెపూల వాసనలు గురించి ఇష్టం వచ్చినట్లుగా అబద్ధాలు చెప్పే వారికి మల్లెపూలు నలిపిన కథలు బాగా తెలిసిన వారికి పదవులు ఇస్తారా..' అంటూ మాధవీలత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. . సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే మాధవీలత తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ చర్చకు దారితీసాయి.

ఏపీ బీజేపీ నేత సాధినేని యామిని వారణాసి (కాశీ)లోని కాశీ విశ్వనాథ ట్రస్ట్ దక్షిణాది అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. దీనికి సంబంధించి ఆలయ పాలక మండలి సీఈవో విశాల్ సింగ్ ఆదేశాలు జారీచేశారు. ఈ విషయాన్ని యామిని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు..

 ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రస్తావిస్తూ.. ఎలక్షన్స్ కి ముందు ప్రధాని మోడీని తిట్టిన యామినికి పదవులు కట్టబెట్టి ఇన్నాళ్లు పార్టీలో ఉన్న మాధవీలతను గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మాధవీలత స్పందించి.. ''ఇండియాలో పదవులు రావాలంటే టాలెంట్ అక్కర్లేదు.. రికమండేషన్స్ ఉంటే చాలు.. గొప్ప వాళ్లతో పరిచయాలు ఉంటే చాలు.. తప్పుగా చెప్పట్లేదు. పాలిటిక్స్ అనే కాదు క్లర్క్ కానిస్టేబుల్ జాబ్స్ విషయంలో కూడా ఎందులోనైనా రికమండేషన్స్ ఉంటాయి

. నాకు గొప్పవాళ్లు ఎవ్వరూ లేరూ రికమండ్ చేయడానికి అభిమానులు తప్ప.. ఆలస్యమైనా దేవుడు మంచి చేస్తాడు. దేశం గుర్తించేంత గొప్పగా.. టీవీ ఛానల్స్ అన్ని మారుమోగిపోయేలా.. కష్టానికి కాలం పడుతుంది. కానీ వెయిట్ చేయాలి.. నాపై అభిమానాన్ని చూపిస్తున్నందుకు మీకు థ్యాంక్స్'' అని సమాధానం ఇచ్చింది. సాధినేని యామినికి రికమండేషన్స్ వల్లనే పదవి వచ్చిందని చెప్పకనే చెప్పింది. మరి మాధవీలత వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox