Breaking News

ఎల్లో మీడియా దిగజారి పోయింది:విజయసాయి రెడ్డి

11 th Jun 2020, UTC

తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా వార్తలు రాయడానికే ఎల్లో మీడియా పరిమితమై పోయిందని  వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఒకవైపు జగన్ సంక్షేమ పధకాలను పొగుడుతూనే టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడిపై  ఆయన సెటైర్లు వేసారు.

న్యాయస్థానాల్లో వాదనలను కూడా నిష్పాక్షికంగా చూపలేని నీచ స్థాయికి ఎల్లో మీడియా దిగజారి పోయిందని  విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ లో ఆరోపించారు.బాబు గారిని ఉతికి ఆరేసినా.. ప్రభుత్వానికి షాక్ అని రాయడం అలవాటై పోయింది. ప్రజలు విశ్వసించరని తెలిసినా, యజమాని బాబు మెచ్చుకుంటే చాలనే భావన అనుకుల మీడియాదంటూ’ ట్విట్టర్‌లో దుయ్యబట్టారు.

నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు ఏటా పది వేల సాయం అందించే జగనన్న చేయూత పథకం దేశంలోనే వినూత్నమని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ఈ వర్గాలకు నేరుగా నగదు బదిలీ చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదని పేర్కొన్నారు. కరోనా వల్ల ఆదాయ వనరులు తగ్గినా రూ.247 కోట్లు పంపిణీ చేసి పెద్ద మనసు చాటుకున్న జగన్ గారికి వారంతా రుణపడి ఉంటారని ఆయన ట్వీట చేశారు.

తెలుగు ప్రజలతో చినబాబు సంబంధాలు పెట్టుకోలేకపోతున్నారు. ప్రజలంతా ఆయనను తిరస్కరించారు. ఇక కిమ్ జాంగ్ ఉన్ తదితర నేతలతో వ్యవహారాలు నడపడానికి చంద్రబాబు ఆయన్ను తెలుగుదేశం పార్టీకి అంతర్జాతీయ అధ్యక్షుడిగా చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది" అని వ్యంగ్యంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox