Breaking News

హిందీ, సంస్కృత భాషలను బలవంతంగా రుద్దే ప్రయత్నం : డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్

01 st Aug 2020, UTC

చెన్నై : కేంద్రం తీసుకొచ్చిన విద్యా సంస్కరణలు కొత్త విద్యా విధానం కానే కాదని  హిందీ, సంస్కృత భాషలను తమ మీద బలవంతంగా రుద్దేందుకే దీన్ని ప్రవేశపెట్టారని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ ఆరోపించారు.భావసారూప్యత గల పార్టీలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి దీనిపై పోరాడతామని స్టాలిన్ పేర్కొన్నారు.

ఆధిపత్య భావజాలంతో కూడిన పురాతన మనుస్మృతికి మెరుగులు అద్దడమే తప్ప ఇది కొత్తదేం కాదని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన డీఎంకే పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ రాశారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

మెడికల్ ప్రవేశాల్లో ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ)లో ఓబీసీ రిజర్వేషన్లపై మద్రాసు హైకోర్టుకు వెళ్తున్న విషయం కూడా ఈ సందర్భంగా స్టాలిన్ గుర్తుచేశారు. ఇప్పటి వరకు విజయవంతంగా సాగుతున్న 10+2 విధానాన్ని ఎత్తేసి 5+3+3+4  విధానాన్ని తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. చిన్న పిల్లలకు ఒకేషనల్ విద్య అంటే వారిపై మానసిక దాడికి దిగడమేనని ఆయన అన్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox