Breaking News

మీనేతల బ్రాండ్ బాజాకు ఏం సమాధానం చెప్తారు: దేవినేని ఉమా

08 th Jun 2020, UTC

ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్‌ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  ‘‘ప్రభుత్వ షాపుల్లో నాసిరకం మద్యం. బయట రాష్ట్రాల నుండి విచ్చలవిడిగా ఎన్డీపీ లిక్కర్. మీ పార్టీ నేతల కనుసన్నల్లోనే బ్రాండ్ల మద్యం అమ్మకాలు. రాష్ట్రంలో సారా ఏరులై పారుతుంది. నాసిరకం మద్యం, సారాలతో పోతున్న ప్రజల ప్రాణాలకు, మీనేతల బ్రాండ్ బాజాకు ఏం సమాధానం చెప్తారు’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు.

 దశలవారీగా మద్యనిషేధంలో భాగంగా ఏపీ ప్రభుత్వం షాపులు, బార్ల సంఖ్య  ను తగ్గించింది. మద్యం రేట్లను కూడ పెంచింది.  మద్యపాన ప్రియులు అడిగే బ్రాండ్లు కాకుండా  ఇతర బ్రాండ్లను షాపుల్లో వుంచుతుంది. ఇవన్నీ మద్యం అమ్మకాలను తగ్గిస్తాయనేది ప్రభుత్వం అభిప్రాయంగా వుంది. అయితే  వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాల నుంచి బ్రాండ్ల మద్యం రకాలను తీసుకు వచ్చి అధిక రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox