Breaking News

మోసగాళ్లు అధికారంలోకి వస్తే అన్నీ మోసాలే:చంద్రబాబు నాయుడు

09 th Jun 2020, UTC

జగన్ సర్కార్ ఏడాది పాలనపై ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ ఇమ్మని కాళ్ళావేళ్ళా పడి, బతిమాలి అధికారంలోకి వచ్చినవారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వాలతో పోటీపడి మంచిపేరు తెచ్చుకోవాలి కానీ, పాలకులు ఆ అవకాశాన్ని చేజేతులా కాలరాశారని విమర్శించారు. అవినీతి, అరాచకాలతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఏడాదిలోనే ప్రజల భవిష్యత్తును నాశనం చేశారన్నారు.తొలి ఏడాదిలోనే ఇన్ని తప్పులా? ఇంత ప్రజా వ్యతిరేక పాలనా? ఇన్ని జీవోల రద్దా? అని ప్రశ్నల వర్షం గుప్పించారు.

ప్రభుత్వం కోర్టులతో ఇన్ని చివాట్లు తినడం గతంలో ఎన్నడూ లేదన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ది రివర్స్ అని, పేదల సంక్షేమంలో రద్దులు-కోతలు, నిధుల దారిమళ్లింపు, దుర్వినియోగం తప్ప మరొకటి లేదన్నారు. రాష్ట్రాన్ని రౌడీల రాజ్యంగా మార్చారని ఆరోపించారు. తెలుగుదేశం 5ఏళ్ల పాలనలో ఎప్పుడైనా గ్యాంగ్ వార్‌లు జరిగాయా? నేరగాళ్ల పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి వైసీపీ అరాచకాలే రుజువని ఎద్దేవా చేశారు. మోసగాళ్లు అధికారంలోకి వస్తే అన్నీ మోసాలే అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దగాకోరుల రాజ్యంలో అన్నివర్గాల ప్రజలకు దగానే ఏడాదిలో 90% హామీలు నెరవేర్చారో.. 90% మోసాలకు పాల్పడ్డారో ప్రజల్లోకి వెళ్లి అడిగితే వాళ్లే చెబుతారు. 3 రాజధానుల బిల్లు, పిపిఏల రద్దు, బీసిల రిజర్వేషన్ల తగ్గింపు, ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు, కౌన్సిల్ రద్దు బిల్లు, ఎలక్షన్ కమిషనర్ తొలగింపు.. స్కీముల రద్దులు-పేర్లు మార్పు, జీవోల రద్దులు...అన్నీ తుగ్లక్ చర్యలే, అనాలోచిత అహంభావ నిర్ణయాలే, చేతగాని పాలన నిర్వాకాలే... ఇలా రాష్ట్రం ఎప్పుడైనా నవ్వుల పాలైందా? పాలకుల అవినీతి, అసమర్ధత రాష్ట్రానికి కీడు చేస్తుంటే అడ్డుకోవాల్సింది ప్రజలే చేటుదాయక నిర్ణయాలను అడ్డుకునే బాధ్యత ప్రతిపక్షాలకే కాదు, ప్రజలకూ ఉంది. వివిధ మాధ్యమాల ద్వారా వైసీపీ పాలనా లోటుపాట్లను ఎత్తిచూపండి, దారితప్పిన ఈ ప్రభుత్వాన్ని చక్కదిద్దండి అని ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.  

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox