Breaking News

సీఆర్‌పీఎఫ్‌ బెటాలియన్ కరెంట్‌ బిల్లు రూ.1.5 కోట్లు

23 rd Aug 2020, UTC

కశ్మీర్: ముంబయ్ లో లాక్ డౌన్ సమయంలో బాలీవుడ్ నటులకు పలువురికి లక్షల్లో కరెంట్ బిల్లు రావడం దీనిపై  వారు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే కశ్మీర్‌లోని సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌) బెటాలియన్‌కూ భారీగానే బిల్లు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కశ్మీర్‌లోని సీఆర్‌పీఎఫ్‌ 181 బెటాలియన్‌ కేంద్రానికి ఏకంగా 1.5 కోట్ల కరెంట్‌ బిల్లు వచ్చింది. ఇది చూసిన బెటాలియన్‌ అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ బిల్లంతా జూలై నెలకు మాత్రమే వచ్చిందని అధికారులు వాపోయారు. దీనిపై స్పందించిన సీఆర్‌పీఎఫ్‌ అధికారి జుల్ఫీకర్‌ హసన్‌.. సాంకేతిక లోపం కారణాంగా అంత పెద్ద మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని వివరించారు. దీనిపై కశ్మీర్‌ విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox