Breaking News

పేదల ఇళ్ల స్దలాల మీద సీబీఐ విచారణ చేయండి: బుద్దా వెంకన్న

06 th Jul 2020, UTC

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద స్కామ్‌కు తెరలేపారని  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.ఆ స్కామ్ గురించి ఒక్క టీడీపీ నేతలే కాదు.. సాక్షాత్తు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారనిఆయన  అన్నారు.

 గ్రామాల్లో రూ. 4,5 లక్షలు కూడా విలువ చేయని భూములను సుమారు రూ. 40, 50 లక్షలు పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని  ఈ విధంగా ప్రజా ధనాన్ని దోచుకోడానికి ఏ1, ఏ2లు ఒక పథకం పన్నారని విమర్శించారు

దీనిపై జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ ప్రభుత్వం పాలు, పెరుగుపై సీబీఐ విచారణ జరపాలని అంటోందని, చంద్రబాబు కుటుంబం నిజాయితీగా.. 30 ఏళ్లకుపైగా హెరిటేజ్ వ్యాపారం చేస్తున్నారన్నారని బుద్దా వెంకన్న అన్నారు. వైఎస్ హయాంలోనే దీనిపై విచారణ చేశారని, ఏమీ నిరూపించలేకపోయారని అన్నారు.

 నిజాయితీగా వ్యాపారం చేస్తున్నారు కాబట్టే ఆయన ఏమీ చేయలేకపోయారన్నారు. ఇవాళ పాలు, పెరుగు మీద సీబీఐ విచారణ అంటున్నారని, ఈ ప్రభుత్వానికి దమ్ముంటే.. నిజాయితీగా పేద ప్రజలకు ఇళ్లు ఇస్తున్నామని ఆత్మ సాక్షిగా మీరు అనుకుంటే.. మీరు రైతుల దగ్గర నుంచి సేకరిస్తున్న పొలాలకు, వాళ్లకు ఏ ధర ఇస్తున్నారో.. మధ్యలో దళారీలను పెట్టి మీరు కోట్లకు కోట్లు కొట్టేస్తున్నారో దానిపై సీబీఐ విచారణ చేయించగలరా? అని జగన్ ప్రభుత్వాన్ని బుద్దా వెంకన్న సవాల్ చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox