Tamannaah Bhatia: నీలిరంగు లెహంగాలో రచ్చ చేస్తోన్న అందాల తమన్నా prime9team 2 years ago Tamannaah Bhatia తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని తన కతాలో వేసుకుంది.ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బబ్లీ బౌన్సర్ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ కామెడీ డ్రామా ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer). మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా థియేటర్ లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో రిలీస్ అయింది.ప్రస్తుతం హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. హీరోయిన్ తమన్నా పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవతూనే వస్తుంది. ఇపుడు తాజాగా మరొక రూమర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. త్వరలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయ్యిందని గాసిప్స్ వస్తునాయి అందుకే సినిమాలు కూడా తగ్గించేసిందని అంటున్నారు. తమన్నా పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని కొన్ని రోజుల క్రితమే పెళ్లి ఒకే చెప్పిందని కూడా టాక్ నడుస్తోంది. మరోవైపు తాజాగా తమన్నా మెహందీ పెట్టుకున్నానంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు దీంతో కొంపదీసి తమన్నా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటున్నారా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తమన్నా సూపర్ పాపులర్ అయ్యింది.బోలే చుడియాన్ సినిమాలో నటిస్తుంది. ఇక తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమా చేయగా అది డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో పాటుగా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో జత కడుతుంది తమన్నా. Tamannaah Bhatia తమన్నా నితిన్‌తో అంధాదున్ తెలుగు రీమేక్‌లో నటించింది. ఈ సినిమా ఇంకా హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది తమన్నా 2005లో 15 సంవత్సరాల వయస్సులో శ్రీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇక 2011లో డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం లో వొచ్చిన 100% లవ్‌తో మంచి బ్లాక్ బూస్టర్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా రచ్చ , ఎందుకంటే… ప్రేమంట! , రెబల్ , కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో అదరగొట్టింది. బాలీవుడ్ లో హీరోయిన్గా హిమ్మత్వాలా (2013) తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా 1983లో అదే పేరుతో వచ్చిన హిందీ చిత్రానికి రీమేక్. ఒరిజినల్లో శ్రీదేవి పోషించిన పాత్రను ఆమె పోషించింది ఇక తమన్నా SS రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలతో మరింత పాపులర్ అయ్యింది. ఈ భామ ఆస్తులు గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నాకు ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన జుహూలో రూ.16.60 కోట్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉందట. Tamannaah Bhatia