Shivatmika Stunning in Black Saree: సీనియర్ హీరో,యాంగ్రీమేన్ రాజశేఖర్ కూతుళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పెద్ద కూతురు శివాని, చిన్న కూతురు శివాత్మిక.
ఇప్పటికే వారిద్దరు హీరోయిన్లుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. కానీ తండ్రి స్టార్ అయినా, తల్లి నటి డైరెక్టర్ అయినప్పటికీ వారికి పెద్ద లక్క్ కలిసి రాలేదని చెప్పాలి. ప్రస్తుతం ఆఫర్స్ కోసం ఈ సిస్టర్స్ పాట్లు పడుతున్నారు.
ఇదిలా ఉంటే శివాని వెండితెరపై అద్భుతం చిత్రంతో అలరించింది. ఇక శివాత్మిక ‘దొరసాని’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు పొంది.
ముఖ్యంగా ఇందులో అమాకత్వపు చూపులు, అందం, అభినయంకు కుర్రకారు మనసు పారేసుకుంది. ముఖ్యంగా ఆమె పెద్ద కళ్లు ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.
చివరిగా కృష్ణవంశీ రంగమార్తాండ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా ఆఫర్స్ ఏం లేకపోవడంతో వెండితెరపై ఆమె జోరు తగ్గిపోయింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది.
తరచూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తుంది. సినిమాల్లో పద్దతిగా కనిపించిన శివాత్మిక.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ పెంచేసింది. హాట్‌హాట్‌గా ఫోటోలకు ఫోజులు ఇస్తుంది. చీరలో, ట్రెండీవేర్‌లో అందాలు ఆరబోస్తుంది.
తన కలువ కళ్లతో కొంటెగా చూస్తు కుర్రకారు మనసు దోచేస్తోంది. తాజాగా ఈ భామ నల్ల చీరకట్టి ట్రెడిషనల్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ట్రెండీగా కనిపిస్తూనే గ్లామర్ షో చేసింది. ప్రస్తుతం శివాత్మిక ట్రెడిషనల్ లుక్‌కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
నల్ల చీరల, గాజులు ధరించి ట్రెడిషన్ లుక్‌లో కొంటె చూపులతో అభిమానులు కట్టిపడేస్తోంది. ఆమె ఇలా చూసి చూపు తిప్పుకోవడంతో కష్టంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.