Pooja Hegde: రెట్రో లుక్ లో బుట్ట బొమ్మ.. ఏమైనా అందమా అమ్మా Prime9 News 1 month ago అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెప్పాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా వరకు గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ చిన్నది ఆ తరువాత ఐరెన్ లెగ్ గా మారింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో చేసిన ఏ సినిమా కూడా పూజాకు హిట్ ను అందించలేకపోయింది. ఇక దీంతో పూజా ఒక ఏడాది గ్యాప్ తీసుకుంది. కుటుంబంతో కలిసి వెకేషన్స్ ఎంజాయ్ చేసింది. ఏడాది గ్యాప్ తరువాత పూజా నటిస్తున్న చిత్రం రెట్రో. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హీరోయిన్ గా నటిస్తోంది. రెట్రో సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దీంతో రెట్రో లుక్ లోనే ముద్దుగుమ్మ కనిపిస్తుంది. తాజాగా పూజా హెగ్డే రెట్రో లుక్ లో అదరగొట్టింది. కలువ పువ్వులను చేతిలో పట్టుకొని మరొక కలువ పువ్వులా కనిపించింది. పింక్ అండ్ గోల్డ్ కలర్ చీరలో అమ్మడు మరింత అందంగా కనిపించింది. ప్రస్తుతం పూజా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి రేపు పూజా హెగ్డే.. రెట్రో సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.