Divi Vadthya: చిలక పచ్చ కోకలో చిట్టి నడుము చూపి రెచ్చగొడుతుందిగా..
Roja Pantham
దివి వద్థ్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టిన దివి.. బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మంచి గుర్తింపును తెచ్చుకుంది.
బిగ్ బాస్ తరువాత దివికి మంచి మంచి ఛాన్స్ లే వచ్చాయి. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటించింది.
ఇక ఈ మధ్యనే డాకు మహారాజ్ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించి మెప్పించింది.
సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తుంది.
తాజాగా దివి చీరకట్టులో కనిపించి షాక్ ఇచ్చింది. చిలకపచ్చ కోక కట్టి.. నడుము అందాలను ఎరగా వేసి ప్రేమ మైకంలో మునిగిపోయి కనిపించింది.
నీ కవితలు చదివి గడిపేస్తా రోజంతా…
చదువు తున్నంత సేపు నవ్వుతూ ఉంటా…
కన్నులు తెరిచిన దగ్గర నుండి మూసే దాకా నీ ఊహలో బ్రతికేస్తా.. అంటూ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.