Anupama Parameswaran: ఓ మై లిల్లీ.. చీరకట్టుతో గుండెలను మెలిపెట్టావే మళ్లీ
Prime9 News
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.
తెలుగులో కార్తికేయ 2 తరువాత అమ్మడి రేంజ్ మారిపోయింది.
కార్తికేయ 2 తరువాత టిల్లు స్క్వేర్ తో తెలుగులో హాట్ గర్ల్ గా మారిపోయింది. అందరూ ఆమెను లిల్లీ అని పిలవడం మొదలుపెట్టారు.
తెలుగులోనే కాకుండా తమిళ్ లో బిషోన్ అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా సమయంలోనే ధృవ్ విక్రమ్ తో పరిచయం ప్రేమగా మారిందని వార్తలు వినిపించాయి.
ఇక నిత్యం సోషల్ మీడియాలో సైతం ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే అనుపమ.. తాజాగా చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది.
గోల్డ్ కలర్ చీరపై గ్రీన్ కలర్ బ్లౌజ్ తో అచ్చ తెలుగు ఆడపడుచులా కనిపించింది. ఇంకా ఆ వైట్ అండ్ గ్రీన్ నెక్లెస్ సెట్.. కొప్పున మల్లెపూలు ఆమె అందాన్ని మరింత పెంచాయి.
ప్రస్తుతం అనుపమ పరమేశ్వరన్ చీర ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.