Breaking News

కర్ణాటక సీఎంని మార్చేస్తారా?

30 th Nov 2020, UTC
కర్ణాటక సీఎంని మార్చేస్తారా?

బెంగళూర్‌ :ప్రస్తుత కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన వయసు 77 సంవత్సరాలు. అయితే, వయసు రీత్యా ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి, మరే యువ నేతకైనా ముఖ్యమంత్రిగా పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం. కర్ణాటక సీఎం ఎడ్యూరప్ప (77)స్థానములో యువకుడికి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు ఇప్పటికే ఆ పార్టీ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 

బిజెపి సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు పైబడిన వారు పార్టీ పదవుల్లో ఉండకూడదు అన్న రూల్ ప్రకారం యడ్యూరప్పను పక్కన పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు, యడ్యూరప్ప పై సొంత పార్టీ నేతల్లోనే అసంతృప్తి వెలుగు చూస్తోంది. ఎప్పటినుంచో పార్టీ కోసం పని చేస్తున్న వారిని కాకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప పై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో, ఆయన్ను తప్పించాలనే ఉద్దేశంలో సొంత పార్టీ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

వయసు రీత్యా ఆయన పూర్తి స్థాయి బాధ్యతలను నిర్వహించలేరని, అందుకే ఆయన స్థానంలో మరో యువ నేతను తీసుకురావాలని పార్టీలో సీనియర్లు కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో ఈ అంశం చర్చనీయాంశంగా ఉంది. మరిన్ని జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox