Breaking News

బలహీనపడుతున్న భారత పాస్ పోర్ట్... మరో స్థానం వెనక్కి..!

13 th Jan 2021, UTC

భారత పాస్ పోర్ట్ క్రమంగా బలహీన పడుతోంది. గతంలో భారత పాస్ పోర్ట్ కు 59 దేశాలకు వీసా లేకుండా పర్యటన చేసే అవకాశం ఉండేది. తాజాగా, మరో దేశం భారత్ కు వీసా తప్పనిసరి చేయడంతో ఒక స్థానానికి పడిపోయింది. అంటే భారత్ ప్రజలు 58 దేశాలకు ప్రత్యేకంగా వీసా తీసుకోకుండా పాస్ పోర్ట్ తో ప్రయాణించవచ్చు. ఒక స్థానం తగ్గడంతో వీసా లేకుండా ఏ దేశానికీ అయినా వెళ్లగలిగే దేశాల జాబితా లో భారత్ 85వ స్థానంలో నిలిచింది.

హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 ఈ విషయాన్నీ తెలుపుతోంది. గత సంవత్సరంలో భారత్ 84 వ స్థానంలో ఉండేది. తాజాగా, ఒక స్థానం తగ్గడంతో 85వ ప్లేస్ లోకి వచ్చింది. అయితే, ప్రపంచ దేశాల్లో ఎక్కువ దేశాలకు వీసా లేకుండా వెళ్లగలిగే దేశం జపాన్. జపాన్ పాస్ పోర్ట్ ఉన్నవారు 191 దేశాల్లో వీసా లేకుండా వెళ్లి రావచ్చు. రెండవ స్థానంలో జర్మనీ నిలిచింది. జర్మనీ పాస్పోర్ట్ ఉన్నవారు 190 దేశాలకు ముందస్తు వీసా లేకుండా వెళ్లి రావచ్చు. మూడవ స్థానంలో దక్షిణ కొరియా నిలిచింది. దక్షిణ కొరియా పాస్పోర్ట్ ఉంటె 189 దేశాల్లో ముందస్తు వీసా లేకుండా వెళ్ళవచ్చు.

హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021  ప్రకారం 1. జపాన్ (191); 2. సింగపూర్ (190); 3. జర్మనీ, దక్షిణ కొరియా (189); 4. ఫిన్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, స్పెయిన్ (188); 5. ఆస్ట్రియా, డెన్మార్క్ (187); 6. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ (186); 7. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ (185); 8. ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా (184); 9. కెనడా (183), 10. హంగరీ (182) దేశాలు టాప్ టెన్ లో ఉన్నాయి. వీటిలో కొన్ని దేశాలు పూర్తిగా వీసా లేకుండానే పర్యటనకు అనుమతిస్తున్నాయి, కానీ కొన్ని దేశాలు మాత్రం అక్కడకి వచ్చాక వీసా తీసుకోవాలని నిబంధన పెడుతున్నాయి. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox