Breaking News

కాంగ్రెస్ ప్రభుత్వానికి వీహెచ్ పీ ప్రశంసలు..!

07 th Jul 2020, UTC

రాజస్థాన్‌లోని కాంగ్రెస్ పాలిత అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రశంసల వర్షం కురిపించింది. రాష్ట్రంలో వేద విద్య, సాంస్కృతిక బోర్డును ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకోవడంతో పాటు, స్కూల్ పాఠ్యాంశాల్లో పరమ్‌వీర చక్ర పతక గ్రహీతల జీవిత చరిత్రలను చేర్చడంపై హర్షం వ్యక్తం చేసింది.

సోమవారం జైపూర్‌లో జరిగిన వీహెచ్‌పీ రాష్ట్ర స్థాయి సమావేశంలో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సమావేశం ముగింపు కార్యక్రమంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన వీహెచ్‌పీ కేంద్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు దినేశ్ చంద్ర... ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ను అభినందించారు.

గతేడాది జరిగిన ఓ కార్యక్రమంలో అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. రాజస్థాన్‌ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలు ప్రతి ఒక్కరినీ స్వచ్ఛంద సేవకు ప్రోత్సహిస్తాయనీ.. ఈ మహోన్నత సంప్రదాయాలను భావి తరాలు కూడా స్వీకరించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం వైదిక విద్య, సంప్రదాయాల బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

 తాజాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. జగద్గురు రామానందాచార్య రాజస్థాన్ సంస్కృత యూనివర్సిటీ ఇప్పటికే ప్రాచీన వేద విజ్ఞాన శాస్త్రాన్ని బోధించడం ద్వారా సంస్కృతి, విలువలను పెంచేందుకు కృషి చేస్తోంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox