Breaking News

ఆడబిడ్డా.. మగబిడ్డా తెలుసుకోవాలని గర్బం చీల్చేసాడు..

20 th Sep 2020, UTC

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ :గ‌ర్భంతో ఉన్న త‌న భార్య మగ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుందో, లేదా ఆడ‌పిల్ల‌ను ప్ర‌స‌విస్తుందో తెలుసుకునేందుకు ఆమె భర్త  గ‌ర్భాన్ని ప‌దునైన క‌త్తితో చీల్చాడు. దీంతో ఆమె తీవ్ర గాయపడటంతో  స్థానికులు హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బ‌రేలీ ప్రాంతంలో సివిల్ లైన్స్ సోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని నెక్‌పూర్ ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప‌న్నాలాల్ అనే ఓ వ్య‌క్తికి ఇప్ప‌టికే 5 మంది కుమార్తెలు జ‌న్మించారు. కానీ అత‌నికి కుమారుడు పుట్టాల‌ని ఆశ ఉంది. దీంతో అత‌ని భార్య మ‌ళ్లీ గ‌ర్భం ధరించింది. అయితే పుట్టబోయే బిడ్డ ఎవరనేది తేల్చుకోవడానికి అతను ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. ప్ర‌స్తుతం ఆమె  7 నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని పోలీసులు తెలిపారు. పోలీసులు ప‌న్నాలాల్‌ను అరెస్టు చేసి కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox