Breaking News

యోగి సర్కార్ తోనే యూపీ అభివృద్ది.. ప్రధాని నరేంద్రమోదీ

14 th Sep 2021, UTC

ఉత్తర ప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క  డబుల్ ప్రయోజనాలకు ఒక ఉదాహరణగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  మంగళవారం యూపీలోని అలీఘర్ లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ స్టేట్ యూనివర్శిటీని ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూఒకప్పుడు దేశాభివృద్ధికి ఒక అడ్డంకిగా భావించిన యుపి - నేడు దేశంలోని అతిపెద్ద అభివృద్ధి  కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తుండటం చాలా సంతృప్తినిస్తోందని అన్నారు. 

ఉత్తర ప్రదేశ్ జాతీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా పెరుగుతోంది. అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించినప్పుడు ఇది జరుగుతుంది. అంతేకాదు ఇక్కడ  అవసరమైన వనరులు అందించబడ్డాయని ఆయన పేర్కొన్నారు.మాజీ ముఖ్యమంత్రులు - అఖిలేష్ యాదవ్ మరియు మాయావతి - పేర్లు  ప్రస్తావించకుండా ప్రధాని మోదీ వారిపై  విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో ఒకప్పుడు  గూండాలు మాత్రమే పరిపాలించిన కాలం ఉంది. కానీ ఇప్పుడు దోపిడీదారులు, మాఫియా నాయకులు అందరూ కటకటాల వెనుక ఉన్నారు. యూపీ ప్రజలు రాష్ట్రం చూసిన మోసాలను మర్చిపోవద్దు .ఈ రోజు యోగి జీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడి పెట్టిందని మోదీ అన్నారు.

భారతదేశం తన ఇమేజ్‌ని "డిఫెన్స్ ఇంపోర్టర్" నుండి ప్రపంచంలోనే అతిపెద్ద డిఫెన్స్ ఎక్స్‌పోర్టర్‌గా మారుస్తోంది "అని ప్రధాని మోదీ అన్నారు.  అలీఘర్ రక్షణ తయారీ కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే 12 రక్షణ సంస్థలు తమ తయారీ యూనిట్లను ఇక్కడ అలీగఢ్‌లో ఏర్పాటు చేస్తున్నాయి"అని  ప్రధాని మోదీ తెలిపారు.

 యుపి  రక్షణ పారిశ్రామిక కారిడార్  2018 లో ప్రకటించబడింది. అలీఘర్, ఆగ్రా, కాన్పూర్, చిత్రకూట్, ఝాన్సీ మరియు లక్నోలో వీటిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేసారు."

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox