Breaking News

యూపీలో గోవ‌ధ‌కు పాల్ప‌డితే కఠిన శిక్షలు...!

10 th Jun 2020, UTC
యూపీలో గోవ‌ధ‌కు పాల్ప‌డితే కఠిన శిక్షలు...!

గోవ‌ధ‌ కు పాల్పడిన వారికి కఠిన శిక్షలు అమలయ్యేలా యూపీ స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీని ప్ర‌కారం గోవును వ‌ధించిన వారికి ఏడాది నుంచి 10 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జైలు శిక్షతో పాటు రూ. 1 ల‌క్ష నుంచి రూ .5 లక్షల వరకు జరిమానా విధించ‌నున్న‌ట్లు తెలిపింది. మంగ‌ళ‌వారం ఈ ఆర్డినెన్స్‌ను  రాష్ర్ట కాబినెట్ ఆమెదించింది.  అంతేకాకుండా  అన‌ధికారికంగా మాంసం ర‌వాణా చేసేందుకు స‌హ‌క‌రించిన డ్రైవ‌ర్‌పై కూడా జ‌రిమానా విధిస్తామ‌ని పేర్కొంది.

గోవుల‌ను  శారీర‌కంగా హింసించినా, వాటి ప్రాణాల‌కు ముప్పు త‌ల‌పెట్టినా  చ‌ట్టంలోని  నిబంధ‌న‌ల ప్ర‌కారం  వారు శిక్షార్హుల‌వుతారని పేర్కొంది. మొద‌టిసారి నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే రూ .1 లక్ష నుంచి రూ .3 లక్షల వ‌ర‌కు జ‌రిమానా విధించగా,   రెండోసారి కూడా నేరానికి పాల్ప‌డితే శిక్ష‌ను రెట్టింపు చేస్తామ‌ని వెల్ల‌డించింది. దీనిపై హోంశాఖ అద‌న‌పు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి  అవనిష్ అవస్థీ మాట్లాడుతూ.. గోవ‌ధ‌కు పాల్ప‌డిన నిందితుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని తెలిపారు.  అంతేకాకుండా వారి ఫోటోల‌ను బ‌హిరంగ ప్ర‌దేశాల్లో అతికిస్తామ‌ని పేర్కొన్నారు.

 గోవ‌ధ నివార‌ణ చ‌ట్టం 1955 ప్ర‌కారం ఎవ‌రైనా గోవ‌ధ పాల్ప‌డితే గ‌రిష్టంగా 7 సంవ‌త్స‌రాల శిక్ష ఉండేది. అయితే ఈ చ‌ట్టంలోని లొసుగుల‌ను వాడుకొని బెయిల్ ద్వారా బ‌య‌టికి రావ‌డం, మ‌ళ్లీ నేరాల‌కు పాల్ప‌డ‌టం లాంటివి జ‌రిగాయి. కాబ‌ట్టి ప్ర‌స్తుతం ఈ చట్టాన్ని స‌వ‌రిస్తూ మార్పులు చేశామ‌ని దీనికి కాబినెట్ ఆమోదించిన‌ట్లు అవస్థీ పేర్కొన్నారు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox