Breaking News

లాక్‌డౌన్ భారత రైతులను అప్పుల ఊబిలోకి దించేసింది:కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

10 th Jun 2020, UTC
లాక్‌డౌన్ భారత రైతులను అప్పుల ఊబిలోకి దించేసింది:కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్

కరోనా వైరస్, లాక్‌డౌన్ భారత రైతులను అప్పుల ఊబిలోకి దించేసిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు. దీంతో సరఫరా గొలుసులో గందరగోళం నెలకొందని పేర్కొన్నారు. అనుకోకుండా లాక్‌డౌన్ ప్రకటించడంతో రైతుల పరిస్థితి మరింత దయనీయమైందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రణాళిక లేని లాక్‌డౌన్ కారణంగా రైతుల పరిస్థితి దిగజారింది. సరఫరా గొలుసు విచ్ఛిన్నమైంది. రైతులు చివరి పంటను అమ్మలేక పోవడంతో రావాల్సినంత డబ్బు రాలేదు. భారీగా అప్పుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన ఏమూలకూ సరిపోలేదు. వారికి సహాయం కావాలిఅని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

రైతుల చెమటతో లాభం పొందుతున్న దళారీ వ్యవస్థను వెంటనే నిర్మూలించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల పంటను నేరుగా భారతీయ ఆహార సంస్థే కొనుగోలు చేయాలని థరూర్ డిమాండ్ చేశారు. దేశంలో మొదటి విడత లాక్ డౌన్ ప్రకటించే సమయానికే  రబీ పంట కోత కు వచ్చింది. అయితే కూలీలు దొరక్క పోవడం తో పంటల కోతకు, వాటిని తరలించడానికి రైతలు అష్టకష్టాలు పడ్డారు. ఎలాగోలా వాటిని  అమ్మకుందామనుకున్నా వారికి తగిన ధర లభించ లేదు.
 
వీటిని దృష్టిలో వుంచుకునే శశి ధరూర్ పై విధంగా ట్వీట్ చేసారు. ఎటువంటి సమయం ఇవ్వకుండా తగిన ప్రణాళిక లేకుండా ప్రకటించిన లాక్ డౌన్ రైతుల జీవితాలనుర అస్తవ్యస్తం చేసిందని వారకి ప్రత్యేక సాయం  చేయాలని ఆయన కోరుతున్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ వలన రైతులకు ఒరిగేదేమీ లేదని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి తగిన సాయం చేయాలని పలువురు నిపుణులు గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox