Breaking News

మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

24 th Nov 2021, UTC

దాదాపు  ఏడాదికాలంగా  దేశ రాజధాని  ఢిల్లీ సరిహద్దుల్లో విస్తృతమైన నిరసనలకు దారితీసిన మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రూపొందించిన  బిల్లు కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది.గత ఏడాది సెప్టెంబరులో పార్లమెంట్ ఆమోదించిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే ప్రతిపాదనకు అధికారిక ఆమోదం లభించింది. 

వివాదాస్పద చట్టాలను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించిన ప్రధాని మోదీ వ్యక్తిగతంగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రైతులను ఒప్పించే ప్రయత్నాలలో "లోపం" ఉందని అంగీకరించారు.వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, 2021, నవంబర్ 29న ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టబడుతుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో మూడు చట్టాలపై చర్చించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఖచ్చితమైన తేదీలను చర్చిస్తోంది

దాదాపు 40 రైతు సంఘాలు దాదాపు ఏడాది కాలంగా ఈ బిల్లులకు  వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నాయి. వారి  ప్రధాన డిమాండ్లలో ఈ మూడు చట్టాలను రద్దు చేయడం ఒకటి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox