Breaking News

ఉమర్, తాహిర్ లను అరెస్ట్ చేయడం ఖాయం.. బీజేపీ నేత కపిల్ మిశ్రా

15 th Sep 2020, UTC

ఢిల్లీ :జేఎన్ యూ విద్యార్ది సంఘం మాజీ నేత ఉమర్ ఖలీద్ ను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీజేపీ నేత కపిల్ మిశ్రా సంతోషం వ్యక్తం చేసారు. ఉమర్, తాహిర్ హుస్సేన్ వంటి నేరస్థులను ఉరితీయడం ఖాయమని తాను పూర్తిగా నమ్ముతున్నానంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కపిల్ మిశ్రా వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో  షేర్ చేసారు.

ఫిబ్రవరి 2020 లో ఢిల్లీలో జరిగిన హింస ముంబై 26/11ఉగ్రవాద దాడికి సమానమని మిశ్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఒక పథకం ప్రకారం హింసాత్మక అల్లర్లకు, దాడులకు ఉమర్, తాహిర్, తదితరులు ప్రయత్నించారనీ, దుకాణాలను తగుల బెట్టి, ప్రజలను మట్టుపెట్టేందుకు చూశారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఉగ్రవాదులను జీవిత ఖైదు చేసి, ఉరితీస్తారన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా చోటుచేసుకున్న అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌ను ఉపా చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox