Breaking News

వైద్యకళాశాలల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్దులకు 7.5 శాతం రిజర్వేషన్లు జివొ జారీ చేసిన తమిళనాడు సర్కార్ 

30 th Oct 2020, UTC

చెన్నై :తమిళనాడులో  వైద్య  విద్యాసంస్దల్లో ప్రవేశాలకు నీట్ అర్హత కలిగిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (జిఓ) జారీ చేసింది. ఇది ఈ విద్యాసంవత్పరం నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది.ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి వరకు చదివి, నీట్ పరీక్షలను క్లియర్ చేసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం రిజర్వ్ చేసే బిల్లును తమిళనాడు క్యాబినెట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ రిజర్వేషన్ దాదాపు 300 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్య సీట్లు పొందడానికి సహాయపడుతుందని  ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ను క్లియర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెడికల్ అడ్మిషన్లలో 7.5 శాతం కోటాను అందించే బిల్లును సెప్టెంబర్ 15 న తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది దీనికి రాష్ట్ర గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వలేదు. అయితే బిల్లుకు త్వరలో్నే గవర్నర్ ఆమోదం లబిస్తుందని సీఎం పళనిస్వామి విశ్వాసం వ్యక్తం చేసారు. .

డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్ కూడా రాష్ట్ర గవర్నర్‌కు ఒక లేఖ రాశారు, ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చి వైద్యులుగా ఎదగాలని కోరుకునే విద్యార్థుల కోసం రిజర్వేషన్ బిల్లును ఆమోదించమని గవర్నర్ ను కోరారు, రాష్ట్రంలో తమప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీట్ పరీక్షలను నిలిపివేస్తుందని ఎంకే స్టాలిన్ తమిళనాడు పౌరులకు హామీ ఇచ్చారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox